Home /News /politics /

TELUGU ACADEMY CHAIRPERSON LAKSHMI PARVATHI SENSATIONAL COMMENTS ON CHANDRABABU BS

ఎన్టీఆర్ కోరికను జగన్ తీరుస్తారు.. లక్ష్మీ పార్వతి సెన్సేషనల్ కామెంట్స్..

లక్ష్మీ పార్వతి ( ఫేస్ బుక్ ఫోటో)

లక్ష్మీ పార్వతి ( ఫేస్ బుక్ ఫోటో)

తెలుగు అకాడమీ చైర్ పర్సన్, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

    తెలుగు అకాడమీ చైర్ పర్సన్, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభించిందని, ఆయన చనిపోకముందు.. బాబును అండమాన్ జైలుకు పంపాలని ఉందని తనతో అనేవారని గుర్తు చేసుకున్నారు. ‘ఎన్టీఆర్ చనిపోకముందు చివరి రోజుల్లో చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబును అండమాన్ జైలుకు పంపాలని ఉందని అనేవారు’ అని వెల్లడించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం జగన్ సిట్ విచారణకు ఆదేశించారని, విచారణలో వాస్తవాలన్నీ బయటపడతాయని అన్నారు. నిజాలు బట్టబయలయ్యాక చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి జైలుకెళ్లడం తాను చూస్తానని ఆమె వ్యాఖ్యానించారు.

    గతంలోనూ చాలా సందర్భాల్లో చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నాడని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆమె కోర్టును ఆశ్రయించారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Lakshmi Parvathi, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు