అలా కుదరదు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. రిజర్వేషన్ల కోటాను పెంచాలన్న అభ్యర్థనను సుప్రీం నిరాకరించింది.

news18-telugu
Updated: December 7, 2018, 2:34 PM IST
అలా కుదరదు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు
సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)
  • Share this:

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కాకు ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లు పెంచాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో బీసీల జనాభా అధికంగా ఉన్నందున ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67 శాతానికి పెంచుకునేలా అమనుతినివ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరింది. అయితే దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

రిజర్వేషన్లు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. పెరిగిన బీసీ జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతినివ్వాలని.. తెలంగాణ తరపు న్యాయవాది కోరారు. అయితే, ఈ అభ్యర్థనను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. పిటిషన్‌ను కొట్టేసింది.
First published: December 7, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading