Home /News /politics /

TELANGNA CONGRESS DEADLINE TO KONDA SUREKHA ON CONTESTING IN HUZURABAD BY ELECTIONS AK

Huzurabad: సాయంత్రం వరకే ఛాన్స్.. ఏదో ఒకటి చెప్పండి.. మాజీమంత్రికి కాంగ్రెస్ డెడ్‌లైన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తుంటే.. బీజేపీ, టీఆర్ఎస్‌లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్.. తనకు పట్టున్న హుజూరాబాద్‌లో మరోసారి గెలిచి సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపిన గులాబీ పార్టీ.. హరీశ్ రావుకు ఇక్కడ టీఆర్ఎస్‌ గెలుపు బాధ్యతలను అప్పగించింది.

ఇంకా చదవండి ...
    హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక్కడ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించాలంటే.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మాజీమంత్రి కొండా సురేఖను ఇందుకోసం ఒప్పించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో... అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. కొండా సురేఖను బరిలోకి దింపాలనే అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయంలో ఆమె ఏదో ఒక కచ్చితమైన నిర్ణయం చెప్పాలని అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌లో పోటీ చేసే విషయమై ఈ రోజు సాయంత్రంలోపు ఏదో ఒక నిర్ణయం చెప్పాలని టీపీసీసీ కొండా సురేఖకు డెడ్‌లైన్ విధించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఈ రోజు సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ వస్తున్నారు. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక కోసమే ఆయన నగరానికి వస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ మొగ్గు చూపిన అభ్యర్థినే బరిలోకి దింపాలనే భావనలో అధిష్టానం ఉందని.. అందుకే అభ్యర్థి ఎంపికను దాదాపుగా ఖరారు చేయాలని ఆయన టీపీసీసీకి సూచించినట్టు తెలుస్తోంది.

    అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వరంగల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన కొండా సురేఖ.. హుజూరాబాద్‌లో పోటీపై అనేక కండీషన్లు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ కండీషన్లు ఒప్పుకుంటేనే తాను హుజూరాబాద్ బరిలోకి దిగుతానని ఆమె టీపీసీసీకి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ హుజూరాబాద్ బరిలోకి దిగుతున్నట్టు ప్రకటిస్తే.. ఆమె షరతులకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్టే అనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఆమె హుజూరాబాద్‌లో పోటీ చేస్తారా ? లేదా ? అనే అంశంపై ఈ రోజు సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

    Telangana Congress: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు ?.. స్పందించిన సీనియర్ నేత.. ఆ తరువాతే ప్రకటన

    Remove Spiders From Home: ఇంట్లో సాలీడు సమస్య ఉందా ? ఇలా చేయండి.. వెంటనే బయటకు వెళ్లిపోతాయి..

    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తుంటే.. బీజేపీ, టీఆర్ఎస్‌లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీమంత్రి ఈటల రాజేందర్.. తనకు పట్టున్న హుజూరాబాద్‌లో మరోసారి గెలిచి సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపిన గులాబీ పార్టీ.. హరీశ్ రావుకు ఇక్కడ టీఆర్ఎస్‌ గెలుపు బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన హుజూరాబాద్‌లోనే మకాం వేసి గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి.. ఈ రెండు పార్టీలకు పోటీ ఇచ్చే స్థాయిలో ప్రచారం చేపడుతుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Huzurabad By-election 2021, Konda surekha, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు