సర్వేపై కేటీఆర్ ట్వీట్.. కౌంటర్ ఇవ్వనున్న లగడపాటి

TelanganaElections2018: ప్రస్తుతానికి ప్రజానాడి ప్రజాకూటమి వైపే ఉందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అయితే, నవంబర్ 20న తనకు లగడపాటి పంపిన మెసేజ్‌ను కేటీఆర్ బయటపెట్టారు.

news18-telugu
Updated: December 5, 2018, 10:41 AM IST
సర్వేపై కేటీఆర్ ట్వీట్.. కౌంటర్ ఇవ్వనున్న లగడపాటి
లగడపాటి రాజగోపాల్, కేేటీఆర్
  • Share this:
తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరికి చేరుకోవడంతో అన్ని పార్టీల మధ్య వార్ పీక్ స్టేజ్‌కి చేరింది. మధ్యలో సర్వేల పేరుతో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో కొన్ని సంస్థలు సర్వేల పేరుతో రోజుకో నెంబర్ రిలీజ్ చేస్తున్నాయి. ఒక సర్వేలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంటుందని చెబితే, మరో సర్వే ప్రజాకూటమికి ఫేవర్‌గా ఉంటోంది. దీంతో ఏ సర్వేలు నమ్మాలో తెలియని గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ సర్వే అందరిలోనూ ఉత్సాహం నింపింది. తెలంగాణలో ప్రజా వాణి ప్రజాకూటమికే అనుకూలంగా ఉందని లగడపాటి చెప్పారు. ఎనిమిది నుంచి పది మంది ఇండిపెండెంట్లు గెలవొచ్చని చెప్పారు. ఓటింగ్ శాంత పెరిగితే ప్రజాకూటమికి అధికారం వస్తుందని, తగ్గితే హంగ్ వచ్చే చాన్స్ ఉందన్నారు. అయితే, లగడపాటి సర్వేపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

గతంలో తెలంగాణ ఎన్నికలపై సర్వే నిర్వహించిన లగడపాటి తనకు ఓ మెసేజ్ చేశారని, ఆ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను కేటీఆర్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. నవంబర్ 20న లగడపాటి చేసిన సర్వే వివరాలను తనకు పంపారని చెప్పారు. ఆ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయని తెలిపారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా చెప్పినట్టు మరో మెసేజ్‌ పంపినట్టు వివరించారు.



తమ మధ్య జరిగిన మెసేజ్ వివరాలను కేటీఆర్ బయటపెట్టడంతో వాటిపై లగడపాటి స్పందించారు. తాను కూడా మరికొన్ని మెసేజ్‌లను వెల్లడిస్తానని చెప్పారు. ఆయన ఎలాంటి మెసేజ్‌లు బయటపెడతారో అని ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.

ఇవి కూడా చదవండి
Published by: Ashok Kumar Bonepalli
First published: December 5, 2018, 10:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading