టీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన కేసీఆర్... హైలెట్ పాయింట్స్ ఇవే...

#TelanganaElections2018: సికింద్రాబాద్‌లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

news18-telugu
Updated: December 2, 2018, 9:38 PM IST
టీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన కేసీఆర్... హైలెట్ పాయింట్స్ ఇవే...
సికింద్రాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కేసీఆర్ (ఫైల్ ఫొటో)
  • Share this:
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ.. తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. సికింద్రాబాద్‌లోని ప్రజాఆశీర్వాద సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 24 అంశాలను ప్రస్తావించారు. వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. వాటిని క్రోడీకరించి మొత్తం 24 అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ప్రభుత్వం ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి, సమయానికి అనుగుణంగా కొత్త పథకాలు అమలు చేస్తామని చెప్పారు.

టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

1. ఆసరా పెన్షన్లను రూ.1000 నుంచి రూ.2016కు పెంపు
2. వికలాంగుల పెన్షన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంపు
3. వృద్ధాప్య పెన్షన్ అర్హత 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు
4. నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతి
5. రైతుబంధు పథకం కింద ఇస్తున్న రూ.8వేలను రూ.10వేలకు పెంపు6. రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీ
7. రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవభృతి
8. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసే కమిటీ ఇచ్చే నివేదికలు అమలు
9. చట్టసభల్లో బీసీలకు 33శాతం, మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు కోసం పోరాటం
10. ఎస్టీలకు 12శాతం, మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ కోసం కేంద్రంతో రాజీలేని పోరాటం
11. ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. కేంద్రం ఆమోదం కోసం పోరాటం.

టీఆర్ఎస్ మేనిఫెస్టో ముఖచిత్రం
టీఆర్ఎస్ మేనిఫెస్టో ముఖచిత్రం


12. వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలన
13. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు
14. వివిధ సామాజికవర్గాల నుంచి రిజర్వేషన్ల ఏర్పాటు కోసం వచ్చిన వినతులను సానుకూలంగా పరిశీలిస్తాం
15. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు
16. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు. వాటి బాధ్యత ఐకేపీ ఉద్యోగులకు అప్పగింత
17. కంటి వెలుగు తరహాలో ఇతర ఆరోగ్య పరీక్షలు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేస్తుంది
18. ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ
19. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ల నుంచి 61కి పెంపు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ నియామక వయోపరిమితి మూడేళ్లు పెంపు
20.పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్
21. అటవీ ప్రాంతాల్లో గిరిజన, గిరిజనేతరుల రైతుల భూ వివాదాలు పరిష్కరించి, యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పోడుభూముల వివాదాలకు త్వరితగతిన పరిష్కారం.
22. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు తీసుకుంటాం
23. సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు అందిస్తాం
24. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీటిని మరింత ముమ్మరం చేస్తాం.

హైదరాబాద్‌లో గత పాలకులు పూర్తి కమర్షియల్‌గా వ్యవహరించారని కేసీఆర్ అన్నారు. ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. రాష్ట్రంలో నల్లాల ఆధునీకరణలకు రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్లు ఖర్చవుతాయన్నారు. అందుకోసం రూ.3వేల నుంచి రూ.4వేల ఇళ్లు కూడా కూల్చాల్సి ఉంటుందని చెప్పారు. కోటి మందికి పైగా ఉండే నగరంలో కనీసం టాయిలెట్లు కూడా లేవన్నారు. 24 గంటల విద్యుత్‌తో హైదరాబాద్‌ జిగేల్ మంటోందని చెప్పారు. రాజధాని నగరంలో నేరాలను పూర్తిగా అదుపు చేశామని చెప్పారు. నాలుగున్నరేళ్లలో ఒక్క మతపరమైన సమస్య కూడా లేదని, ఇదో రికార్డని చెప్పారు. హైదరాబాద్‌లో చేపట్టిన పలు అభివృద్ధి పధకాలను కేసీఆర్ వివరించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 2, 2018, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading