తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు జర్నలిస్టుల మద్దతు

సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు కార్మికులకు ఉంటుందని, వాటిని సానుభూతితో పరిష్కరించాల్సింది పోయి అణిచి వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని టీయూడబ్ల్యూజే నేతలు తెలిపారు.

news18-telugu
Updated: October 9, 2019, 12:16 PM IST
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు జర్నలిస్టుల మద్దతు
బస్ స్టేషన్‌లో పోలీసులు (File Photo)
news18-telugu
Updated: October 9, 2019, 12:16 PM IST
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నప్పటికీ జనం కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా తిప్పలు తప్పడం లేదు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇప్పటికే ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) సంఘీ భావం ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం పోరాడే హక్కు కార్మికులకు ఉంటుందని, వాటిని సానుభూతితో పరిష్కరించాల్సింది పోయి అణిచి వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అద్యక్షుడు నగునూరి శేఖర్‌, ప్రధాన కార్యదర్శి కె. విరాహత్‌ అలీ సోమవారం ఓ ప్రకటన లో విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

ఇవికూడా చూడండి: 

ఓ ఆర్టీసీ కండక్టర్ తల్లి ఆవేదనFirst published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...