భారీ జరిమానాల్లేవ్... తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్

కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని తెలంగాణలో అమలుచేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

news18-telugu
Updated: September 15, 2019, 7:56 PM IST
భారీ జరిమానాల్లేవ్... తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ చట్టంతో దేశవ్యాప్తంగా ప్రజలు భీతిల్లిపోతున్నారు. భారీ జరిమానాలతో వణికిపోతున్నారు. ఓ లారీకి అత్యధికంగా రూ.6లక్షల జరిమానా కూడా విధించారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఈ కొత్త మోటార్ వాహనాల చట్టాన్ని తెలంగాణలో అమలుచేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ దొరికినట్టు అయింది. వాహనదారులు చట్టాలను, ట్రాఫిక్ నిబంధనలను సరిగా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం గత పార్లమెంట్ సమావేశాల్లో మోటారు వాహనాల చట్టంలో జరిమానాలను సవరించింది. తప్పులు చేసిన వారికి భారీ ఎత్తున ఫైన్లు వేయాలని సూచిస్తూ పలు సవరణలు చేసింది. ఇది సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్న తప్పుకి ఇంత భారీ పెనాల్టీలు కట్టాలా? అంటూమండిపడుతున్నారు.

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తెచ్చిన చట్టంలో జరిమానాలను రాష్ట్రంలో తగ్గించింది. ఆ వెంటనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రంగంలోకి దిగారు. ఇంత భారీ జరిమానాలను తాము బెంగాల్లో విధించలేమని, కొత్త మోటారు వాహనాల చట్టాన్ని తాము అమలు చేయబోమని ప్రకటించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. అయితే, ప్రజలు కేవలం జరిమానాలనే చూస్తున్నారని, ప్రాణాలను గమనించడం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మోటారు వాహనాల చట్టంపై రాష్ట్రాలు వాటి నిర్ణయాన్ని తీసుకోవచ్చని చెప్పారు. దీంతో తెలంగాణలో కొత్త చట్టాన్ని అమలు చేయబోమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>