• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA WILL EX MP VIVEKANAND LEAVES TRS AND CONTEST AS INDEPENDENT FROM PEDDAPALLI AK

మాజీ ఎంపీ దారెటు ? టీఆర్ఎస్‌పై రివెంజ్ తీర్చుకుంటారా ?

మాజీ ఎంపీ దారెటు ? టీఆర్ఎస్‌పై రివెంజ్ తీర్చుకుంటారా ?

వివేక్ (ఫైల్ ఫోటో)

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన వివేకానంద... మరికాసేపట్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

  • Share this:
    పెద్దపల్లి మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత వెంకటస్వామి కుమారుడు వివేక్ ఏం చేయబోతున్నారు. పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన వివేకానంద... మరికాసేపట్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది వివేక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో... ఆయనకు బదులుగా చెన్నూరులో బాల్క సుమన్ చేతిలో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేశ్‌కు ఎంపీ టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్.

    ఈ పరిణామంతో తీవ్ర నిరాశలో మునిగిపోయిన వివేక్... ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అయితే వివేక్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి నుంచి గతంలో కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు వివేక్. కాంగ్రెస్‌లోకి వెళ్లడం కూడా ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇప్పటికే పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఎ. చంద్రశేఖర్ పేరును ప్రకటించారు. అయితే టీఆర్ఎస్‌లో టికెట్ రాకపోతే వివేక్ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందనే కారణంగానే... కమలనాథులు పెద్దపల్లి ఎంపీ సీటు అభ్యర్థి ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    మరోవైపు బీజేపీలో చేరాలని బీజేపీ జాతీయనేత రాజ్‌నాథ్ సింగ్ వివేక్‌ను ఫోన్ చేసిన ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే తనకు టికెట్ ఇవ్వని టీఆర్ఎస్‌పై రివెంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న వివేక్... కచ్చితంగా ఈ సారి ఎన్నికల బరిలో దిగి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. వీలైతే బీజేపీలోకి... లేకపోతే బీఎస్పీ తరపున బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి పెద్దపల్లి టికెట్ దక్కని వివేక్... రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.




    First published: