తెలంగాణలో మునిసిపల్ పోలింగ్ షురూ..

Telangana Municipal Elections 2020 : తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌ కోసం 55 వేల మంది సిబ్బంది, 55 వేల మంది పోలీసులు పోలింగ్‌ విధుల్లో పాల్గొన్నారు.

news18-telugu
Updated: January 22, 2020, 7:12 AM IST
తెలంగాణలో మునిసిపల్ పోలింగ్ షురూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Telangana Municipal Elections : తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌ కోసం 55 వేల మంది సిబ్బంది, 55 వేల మంది పోలీసులు పోలింగ్‌ విధుల్లో పాల్గొన్నారు. 1240 మంది ఎన్నికల పరిశీలకులు కూడా ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. అటు.. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్‌ పూర్తి అయ్యే వరకు మద్యం దుకాణాలు, బల్క్ మెస్సేజ్‌లను నిషేధించారు.

అటు.. ఈ నెల 24న ఎన్నికలు జరగనున్న కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో నేటితో ప్రచారం ముగియనుంది. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లు పడకుండా ఈసీ ఓ వినూత్న ప్రయోగం చేయబోతోంది. దేశంలోనే ఏ ఎన్నికలలోనూ ప్రయోగించని " ఫేస్ రికగ్నిషన్" యాప్‌ను తొలిసారి ప్రయోగించబోతున్నారు. ఈ యాప్‌ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి మునిసిపాలిటీలోని 10 పోలింగ్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నారు. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 22, 2020, 6:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading