హోమ్ /వార్తలు /politics /

Telangana BJP: బీజేపీలోకి మరో తెలంగాణ ఉద్యమ నేత.. టీఆర్ఎస్‌కు ఝలక్.. తెరవెనుక చక్రం తిప్పింది ఎవరు ?

Telangana BJP: బీజేపీలోకి మరో తెలంగాణ ఉద్యమ నేత.. టీఆర్ఎస్‌కు ఝలక్.. తెరవెనుక చక్రం తిప్పింది ఎవరు ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘం నేతగా కీలక పాత్ర పోషించిన విఠల్‌ను.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తరువాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యుడిగా నియమించారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు చేరికలను ప్రొత్సహించాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలకు ఆ పార్టీ జాతీయ నేతలు స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్.. త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలక వ్యవహరించాయి. అప్పట్లో టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న స్వామిగౌడ్ ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ, మండలి చైర్మన్ అయ్యారు. ఆ తరువాత టీఆర్ఎస్ తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీలో చేరారు.

ఇక ఉద్యమం సమయంలో టీజీవో నేతగా ఉన్న శ్రీనివాస్ గౌడ్.. ఆ తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి... ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘం నేతగా కీలక పాత్ర పోషించిన విఠల్‌ను.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తరువాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యుడిగా నియమించారు సీఎం కేసీఆర్. అయితే ఆయన పదవీకాలం పూర్తయిన తరువాత మళ్లీ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు.

Trs versus bjp, bjp joinings, telangana latest news, vittal to join bjp, trs latest news, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, తెలంగాణ లేటెస్ట్ న్యూస్
విఠల్ (ఫైల్ ఫోటో)

దీంతో టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న విఠల్.. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన విఠల్‌ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారిని కేసీఆర్ పక్కనపెట్టి.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని ప్రొత్సహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఊపందుకున్నాయి.

KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?

Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

ఈ క్రమంలో అప్పట్లో ఉద్యమంలో పాల్గొన్న వారిని అక్కున చేర్చుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు భిన్నమైన వ్యూహాలతో ముందుకు సాగుతున్న బీజేపీ.. తెలంగాణ కోసం పోరాడి ప్రాధాన్యత దక్కకుండా పోయిన వారిని పార్టీలో చేర్చుకుని కీలక బాధ్యతలు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Bjp, Telangana, Trs

ఉత్తమ కథలు