• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA TRS PRESIDENT KCR MAY CONTEST FROM NALGONDA OR MEDAK FOR LOKSABHA ELECTIONS AK

కేసీఆర్ పోటీ ఎక్కడ ? ఆ రెండు స్థానాలే అంటున్న టీఆర్ఎస్

కేసీఆర్ పోటీ ఎక్కడ ? ఆ రెండు స్థానాలే అంటున్న టీఆర్ఎస్

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్)

లోక్ సభ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లోకి వెళతానని స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

  • Share this:
    లోక్ సభ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లోకి వెళతానని స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. తనకు కలిసొచ్చిన కరీంనగర్ లోక్ సభ సీటును మరోసారి సిట్టింగ్ ఎంపీ వినోద్‌కు కేటాయించారు కేసీఆర్. దీంతో కేసీఆర్ లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తే... ఆ రెండు స్థానాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న కేసీఆర్... భారీ మెజార్టీ కోసం సేఫ్ సీటును ఎంచుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.

    వాస్తవానికి కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా... ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. దీంతో వారిని దెబ్బతీసేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగుతారనే ప్రచారం జరిగింది. నల్లగొండ నుంచి కాకపోతే... కేసీఆర్ తన సొంత జిల్లా అయిన మెదక్‌లోని మెదక్ సీటు నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయొచ్చని తెలుస్తోంది.

    2014 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ లోక్ సభకు పోటీ చేసిన కేసీఆర్... ఎన్నికల తరువాత మెదక్ లోక్ సభకు రాజీనామా చేసి కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేయాలని భావిస్తే... కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి సీటు దక్కకపోవచ్చు. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
    First published: