• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA TRS LEADERS ALLEGES EX MP VIVEK SAYS HE TRIED TO DEFEAT PARTY CANDIDATES IN ELECTIONS AK

వి అంటే వంచన... వి అంటే విద్రోహం... వివేక్‌పై టీఆర్ఎస్ ఫైర్

వి అంటే వంచన... వి అంటే విద్రోహం... వివేక్‌పై టీఆర్ఎస్ ఫైర్

వివేక్ (ఫైల్ ఫోటో)

పార్టీలు మారడం వివేక్, ఆయన సోదరుడికి బాగా అలవాటైపోయిందని టీఆర్ఎస్ విమర్శించింది. సుమన్, మనోహర్, పుట్టా మధులను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

  • Share this:
    టీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్న పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌పై టీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. పెద్దపల్లి పరిధిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వివేక్‌పై విమర్శల వర్షం గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను, ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని బాల్క సుమన్ అన్నారు. వి అంటే వంచన, వి అంటే విద్రోహం అని ధ్వజమెత్తారు. తమకు వ్యక్తులు ముఖ్యం కాదని... పార్టీయే ముఖ్యమన్న బాల్క సుమన్... డబ్బులున్నాయని వివేక్‌కు అహంకారమని ఆరోపించారు. ఆయన ఆటలను పెద్దపల్లిలో సాగనివ్వబోమని వ్యాఖ్యానించారు. పార్టీలు మారడం వివేక్, ఆయన సోదరుడికి బాగా అలవాటైపోయిందని విమర్శించారు.

    సుమన్, మనోహర్, పుట్టా మధులను ఓడించేందుకు వివేక్ ప్రయత్నించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. కేంద్రంలో హంగ్ వస్తే... వివేక్ టీఆర్ఎస్‌లో ఉంటారా ? అని ప్రశ్నించారు. తన అన్న వినోద్‌ను బెల్లంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థిపై గెలిపించేందుకు యత్నించారని అన్నారు. వందశాంత పార్టీని బొందపెట్టేందుకు వివేక్ యత్నించారని ధ్వజమెత్తారు. ఆయన అనుచరులు పార్టీ కార్యక్రమాల్లో కాకుండా కేవలం ఆయన కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారని విమర్శించారు.




    First published: