ప్రగతి భవన్‌కు మంత్రి పువ్వాడ,సునీల్ శర్మ.. కేసీఆర్ ఏం డిసైడ్ చేయబోతున్నారు?

TSRTC Strike : నిజానికి శుక్రవారం సాయంత్రమే పువ్వాడ అజయ్,సునీల్ శర్మ,ఆర్టీసీ ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ కాపీ అందకపోవడంతో.. సమీక్షా సమావేశాన్ని రద్దు చేశారు.

news18-telugu
Updated: October 20, 2019, 4:03 PM IST
ప్రగతి భవన్‌కు మంత్రి పువ్వాడ,సునీల్ శర్మ.. కేసీఆర్ ఏం డిసైడ్ చేయబోతున్నారు?
సీఎం కేసీఆర్ (File Photo)
news18-telugu
Updated: October 20, 2019, 4:03 PM IST
తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో చర్చలు ప్రారంభించాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఆదివారం సీఎంవో కార్యాలయానికి అందింది. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ ప్రగతి భవన్‌కు వెళ్లారు. కోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్‌తో వారు చర్చించనున్నారు.నిజానికి శుక్రవారం సాయంత్రమే పువ్వాడ అజయ్,సునీల్ శర్మ,ఆర్టీసీ ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ కావాలని నిర్ణయించారు. అయితే హైకోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ కాపీ అందకపోవడంతో.. సమీక్షా సమావేశాన్ని రద్దు చేశారు. తాజాగా ఆర్డర్ కాపీ అందడంతో.. తదుపరి చర్యలపై కేసీఆర్ చర్చించనున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులు అని గుర్తుచేసిన కోర్టు.. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలుస్తారా..? లేక అదే మొండి వైఖరిని ప్రదర్శిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది. శనివారంతో స్కూల్స్‌ సెలవులు ముగిసిపోవడం.. తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లు కూడా విధులకు రావద్దంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేయడంతో.. సోమవారం నుంచి రాష్ట్రంలో బస్సులు తిరుగుతాయా..? తిరగవా అన్న చర్చ జరుగుతోంది. ఆర్టీసీ ఇప్పటికే తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడంతో.. సమ్మె మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమ్మెపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...