• Home
 • »
 • News
 • »
 • politics
 • »
 • TELANGANA TRANSPORT MINISTER PUVVADA AJAY KUMAR SAYS SORRY TO POLITICAL LEADERS AT COUNCIL BS

తెలంగాణ శాసన మండలి సాక్షిగా.. క్షమాపణలు చెప్పిన మంత్రి..

తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ శాసన మండలిలో గురువారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఓ మంత్రి ప్రజా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు.

 • Share this:
  తెలంగాణ శాసన మండలిలో గురువారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఓ మంత్రి ప్రజా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు. వివరాల్లోకెళితే.. ప్రజా ప్రతినిధుల ఫోన్లు చేస్తే ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదన్న వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు. ‘ఆర్టీసీ అధికారులు.. ప్రజా ప్రతినిధుల ఫోన్లు లిఫ్ట్‌ చేయకపోవడం, వారికి సమాచారం అందివ్వకపోవడం తప్పే. అందుకు క్షమాపణ చెబుతున్నా’ అని మంత్రి అన్నారు. ఇక, ఆర్టీసీ పార్సిల్‌ సర్వీసుల ద్వారా సంవత్సరానికి రూ. 300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ నెల చివరి నాటికి 100 కార్గో బస్సులను రెడీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.కోటి 50 లక్షల లాభం వస్తోందని, గత రెండు నెలలుగా ఆర్టీసీ ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని వివరించారు.

  కాగా.. ఆర్టీసీ సమ్మె కాలానికి సంబంధించి కార్మికుల జీతాలకు గానూ ప్రభుత్వం రూ. 235 కోట్లు విడుదల చేసినందుకు ఆర్టీసీ జేఏసీ నాయకులే కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సీసీఎస్‌ బకాయిలు, పీఎఫ్ బకాయిల చెల్లింపు కోసం రూ.600 కోట్లు అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని తెలిపారు. జూలై నాటికి రూ.20 కోట్లతో ఖమ్మంలో అత్యాధునిక హంగులతో బస్టాండ్‌ను సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: