తెలంగాణలో కరెంటు కొట్లాట.. తెరపైకి సీబీఐ విచారణ...

తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సందర్భంగా భారీ ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు.

news18-telugu
Updated: August 23, 2019, 4:58 PM IST
తెలంగాణలో కరెంటు కొట్లాట.. తెరపైకి సీబీఐ విచారణ...
కేసీఆర్, లక్ష్మణ్
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ పారదర్శకంగా జరిగాయని ట్రాన్స్ సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. దీనిపై కొందరు అవగాహన లోపం, సమాచార లోపంతో విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘పీపీఏలు రాత్రి రాత్రే చేసుకోరు. ఇప్పటి వరకు ఒకే ఒక పీపీఏ చేసాము. 4.15 పైసలకు చేసాము. చాలా పారదర్శకంగా చేసాము. 3.90 పైసలు యూనిట్ చొప్పున ఛత్తీస్ ఘడ్ తో పీపీఏ చేసుకున్నాం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందం. అన్ని విద్యుత్ సంస్థలు స్వయంప్రతిప్తతితో పని చేస్తాయి. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. దేశంలో థర్మల్ ప్లాంట్స్ లో 90 శాతం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే ఉన్నాయి. మేము చెప్పేది వాస్తవాలు.వాళ్ళు చేసేవి అవగాహన లేని ఆరోపణలు. విద్యుత్ సంస్థ పై సిబిఐ విచారణ, సిట్టింగ్ జడ్జ్ తో విచారణ కూడా సిద్ధం’ అని ప్రభాకర్ రావు ప్రకటించారు.

రాజకీయ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదని ప్రభాకర్ రావు సూచించారు. అన్ని ఒప్పందాలు పారదర్శకంగానే జరుగుతున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కొన్ని ఒడిదొడుకులు ఉండడం సహజమేనని, ముఖ్యమంత్రి ముందుచూపుతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభాకర్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితోనే దక్షిణాది గ్రిడ్, ఉత్తరాది గ్రిడ్ అనుసంధానం సాధ్యమైందని అన్నారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు