• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TELANGANA TPCC APPOINTS CAMPAIGNERS FOR GRADUATE MLC ELECTIONS SK

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్‌గా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్‌గా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు

రేవంత్ రెడ్డి

ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారకర్తగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సమన్వయకర్తగా కాంగ్రెస్ ఆదివాసీ కమిటీ జాతీయ వైఎస్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్‌ను నియమించారు.

  • Share this:
    తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. రెండు స్థానాల కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచాకర్తలు, సయన్వయకర్తలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నియమించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారకర్తగా రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ను నియమించారు. ఇక ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారకర్తగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సమన్వయకర్తగా కాంగ్రెస్ ఆదివాసీ కమిటీ జాతీయ వైఎస్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్‌ను నియమించారు.

    హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం నుంచి అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవి రంగంలోకి దిగారు. ఇదే స్థానం కోసం బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ పోటీ పడుతున్నారు. ఇక ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌, టీజేఎస్ నుంచి కోదండరాంతో పాటు జయసారధి రెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణిరుద్రమ దేవి పోటీపడుతున్నారు.

    కాగా, తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదలయింది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లను స్వీకరించి.. ఫిబ్రవరి 24న నామినేషన్లను పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 26న ముగిసింది. మార్చి 14న ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 17న ఫలితాలను ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: