హుజూర్ నగర్‌లో పోటీ.. టీడీపీలో డైలమా.. చంద్రబాబుదే నిర్ణయం ?

తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేసుకునే అంశంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు... హుజూర్ నగర్‌లో పోటీపై త్వరలోనే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 24, 2019, 4:18 PM IST
హుజూర్ నగర్‌లో పోటీ.. టీడీపీలో డైలమా.. చంద్రబాబుదే నిర్ణయం ?
చంద్రబాబు (File)
news18-telugu
Updated: September 24, 2019, 4:18 PM IST
తెలంగాణలో జరగబోయే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. ఆ పార్టీ తరపున అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. రేపో మాపో వారంతా నామినేషన్ కూడా వేయబోతున్నారు. అయితే హుజూర్ నగర్‌లో పోటీ చేయాలా ? వద్దా ? అనే అంశంపై తెలంగాణ టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. హుజూర్ నగర్‌లో పోటీ చేసే అంశంపై టీ టీడీపీ నేతలు ఎల్. రమణ అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సమావేశమయ్యారు. అయితే దీనిపై నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు మూడు రోజుల్లో దీనిపై తమ నిర్ణయం ఏమిటో చెబుతామని టీడీపీ నేత నర్సిరెడ్డి తెలిపారు.

తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేసుకునే అంశంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు... హుజూర్ నగర్‌లో పోటీపై త్వరలోనే పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీడీపీ... తెలంగాణలో రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ... హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న టీడీపీ... హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది.


First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...