హోమ్ /వార్తలు /రాజకీయం /

సండ్ర టీఆర్ఎస్‌లో చేరతారా? ఆ వ్యాఖ్యలు అందుకేనా?

సండ్ర టీఆర్ఎస్‌లో చేరతారా? ఆ వ్యాఖ్యలు అందుకేనా?

టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర file

టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర file

తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య.

ఇంకా చదవండి ...

    తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. అందులో భాగంగానే టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన సండ్ర వెంకటవీరయ్య. తెలంగాణలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు.. మరి కొన్ని రోజుల్లో టీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్నారనే టాక్ రాజకీయవర్గాల్లో కొన్నాళ్లుగా వినబడుతోంది. అందుకు సంబంధించి చర్చలు కూడా ముగిసిపోయాయని అంటున్నారు. సండ్ర వెంకటవీరయ్యకు మంత్రి పదవి ఆఫర్ చేశారని కొందరు, ఎలాంటి షరతులూ లేకుండానే టీఆర్ఎస్‌లో చేరుతున్నారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు సండ్ర వెంకట వీరయ్య.


    తానేం చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే చేస్తానని స్పష్టం చేశారు సండ్ర. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. తాను పార్టీ మారితే ప్రజలకు చెప్పే మారుతానని స్పష్టం చేశారు. పార్టీ మారితేనే గెలవబోమనీ.. ప్రజల్లో ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే ప్రజల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని సండ్ర చెప్పారు.


    సండ్ర పార్టీ మారుతున్నారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కారెక్కబోతున్నారనే టాక్ వినబడుతోంది. ఈ నేపథ్యంలో సండ్ర వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అయితే, పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఆయన ఖండించకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఆయన టైమ్ చూసుకుని కారెక్కడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన ప్రస్తుతం సత్తుపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.


     


    ఇది కూడా చూడండి:


    First published:

    Tags: Tdp, Telangana, Telangana Election 2018, Telangana News, Trs, TTDP

    ఉత్తమ కథలు