చంద్రబాబు క్లాస్... టీడీపీ నేతల ధర్నా...

TTDP | రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హైదరాబాద్ నగరంలో టీడీపీ బలం పెంచుకోవడానికి వ్యూహం రచిస్తోంది.

news18-telugu
Updated: March 5, 2020, 8:27 PM IST
చంద్రబాబు క్లాస్... టీడీపీ నేతల ధర్నా...
ఇందిరాపార్క్ వద్ద టీటీడీపీ ధర్నా
  • Share this:
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సడన్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో నిరసనకు దిగారు. ‘తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై మహాధర్నా’ పేరుతో ఆందోళనకు దిగారు. ఉరుములు, మెరుపులూ లేకుండా సడన్‌గా తెలంగాణ టీడీపీ నేతలు ఈ మహా ధర్నా చేపట్టడంపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకోవడంతోనే టీడీపీ నేతలు ధర్నాకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. 2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ - టీజేఎస్ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. ఆ తర్వాత చాలా మంది టీడీపీ నేతలు తమ దారి చూసుకున్నారు. టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరొకరు సైలెంట్‌గా ఉండిపోయారు. ఈ క్రమంలో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హైదరాబాద్ నగరంలో టీడీపీ బలం పెంచుకోవడానికి వ్యూహం రచిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీపీ నేతలతో భేటీ అయిన చంద్రబాబునాయుడు పార్టీ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏపీలో సీఎం జగన్ పాలన మీద టీడీపీ ఎదురుదాడి చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంటే, టీటీడీపీ నేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక ఆందోళనతో ప్రజల్లోకి వెళ్తేనే మళ్లీ వారి నమ్మకాన్ని గెలవగలమని స్పష్టం చేసినట్టు తెలిసింది. అవసరమైతే పార్టీ నాయకత్వాన్ని కూడా మార్చేస్తానని హెచ్చరించడంతో నేతలు బరిలోకి దిగినట్టు తెలుస్తోంది.
First published: March 5, 2020, 8:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading