డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ.. ఇందిరా పార్కు వద్ద టీడీపీ మహా ధర్నా..

TDP News: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదలకు పక్కా ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆయన ఆశయాలను చంద్రబాబు కొనసాగించారని.. కానీ కేసీఆర్ సర్కారు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 26, 2019, 12:56 PM IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎక్కడ.. ఇందిరా పార్కు వద్ద టీడీపీ మహా ధర్నా..
ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాలో ఎల్.రమణ తదితరులు
  • Share this:
డబుల్ బడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని టీఆర్‌ఎస్ సర్కారు జాప్యం చేస్తోందని, వెంటనే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ టీడీపీ మహాధర్నా చేపట్టింది. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదలకు పక్కా ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆయన ఆశయాలను చంద్రబాబు కొనసాగించారని.. కానీ కేసీఆర్ సర్కారు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ 6 ఏళ్ల పాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రోజు రోజుకు పాతాళంలోకి వెళ్తోందని విమర్శించారు. రూ.రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్లకు మోక్షం కలగడం లేదని, ఏ పథకం కూడా పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, రాష్ట్రంలో ఉండే ప్రతి పేదబిడ్డకు ఇల్లు అందేవరకు టీడీపీ పోరాటం చేస్తుందని రమణ వ్యాఖ్యానించారు.

పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అనేవాళ్ళు ఇందిరా పార్కు వచ్చి చూడాలని అన్నారు. తెలుగు ఎక్కడ ఉంటే అక్కడ, తెలుగు వారు బతికి ఉన్నన్ని రోజులు టీడీపీ ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నేతలు టీడీపీ నేతలను కొనే పనిలోనే ఉన్నారని ఆరోపించారు. ప్రగతి భవన్, ఫాంహౌస్‌కి కాంట్రాక్టర్లు దొరుకుతుండగా, పేదల ఇళ్ల కోసం మాత్రం లభించడం లేదా? అని ప్రశ్నించారు.
First published: August 26, 2019, 12:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading