ఖరీఫ్‌లో చల్లని కబురు.. రైతన్నలకు పండుగే.. ఖాతాల్లోకి రైతు బంధు పైసలు

Rythu Bandhu Scheme: సహకార సంఘాలు, మహిళాసంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలుచేసిన ధాన్యానికి సంబంధించి రూ.4837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించామని, రూ.1080 కోట్లు బకాయిలు ఉన్నాయని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 5:49 PM IST
ఖరీఫ్‌లో చల్లని కబురు.. రైతన్నలకు పండుగే.. ఖాతాల్లోకి రైతు బంధు పైసలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఖరీఫ్ సాగు మొదలయిన నేపథ్యంలో రైతులకు పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన వారి ఖాతాలలో డబ్బులు జమ చేయాలని, ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుండి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాలలోకి రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మొత్తం 21.22 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.2233.16 కోట్లు రైతుబంధు డబ్బులు జమచేశామని, రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.

సహకార సంఘాలు, మహిళాసంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలుచేసిన ధాన్యానికి సంబంధించి రూ.4837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించామని, రూ.1080 కోట్లు బకాయిలు ఉన్నాయని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం రూ.501 కోట్లు విడుదల చేశామని ఆయన తెలిపారు. ధాన్యం డబ్బుల విషయంలో, రైతుబంధు డబ్బుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. రాష్ట్రానికి రుతుపవనాలు మరికొద్ది రోజులలో రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 11, 2019, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading