Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచనలు

తెలంగాణలోని పలు చట్టాల్లో సవరణలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటిపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.

news18-telugu
Updated: October 11, 2020, 7:40 PM IST
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచనలు
తెలంగాణ అసెంబ్లీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఈ నెల 13, 14 తేదీల్లో తెలంగాణ శాసనసభ, శాసనపరిషత్తు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని అందరి శ్రేయస్సు దృష్ట్యా సమావేశాలు నిర్వహణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గారు, శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉభయ సభల ప్రాంగణాలలో కోవిడ్ పరీక్షల నిర్వహణ నిమిత్తం ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా శాసనమండలి కార్యదర్శి డా. వి నరసింహా చార్యులును ఆదేశించారు. సమావేశాలకు హాజరయ్యే శాసనసభ్యులు, శాసన పరిషత్తు సభ్యులు, ఉభయ సభల సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది లలో ఎవరికైనా అనుమానంగా ఉన్నా లేదా కరోనా లక్షణాలు కనిపించినా తప్పక పరీక్షలు చేయించుకోవాల్సిందిగా స్పీకర్, చైర్మన్ ఆజ్ఞాపించారు. ఈ పరీక్ష కేంద్రాలు ఉభయ సభల ప్రాంగణాలలో 12 వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుండి పనిచేస్తాయి.

నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశంమైంది. నాలా (NALA) చట్టానికి సవరణ చేసింది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ( WITH OUT HUMAN INTERFERENCE) ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేస్తూ.. చట్ట సవరణకు మంత్రి మండలి నిర్ణయించింది. ఇక రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టం - 1955 సవరణ చేసింది. జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్దత కల్పిస్తూ... వార్డు కమిటీల పనివిధానానికి సంబంధించి.. వార్డుల రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో.. చట్ట సవరణలు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రత్యేక సమావేశాల్లో ఆయా చట్టాల్లో చేసిన మార్పులపై చర్చించి ఆమోదించనున్నారు.

సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 16 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీఆర్వో వ్యవస్థతో పాటు రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భూముల రిజిస్ట్రేషన్ సరళతరం చేసేందుకు కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తున్నామని..99.9 శాతం భూముల సమస్యలకు అదే పరిష్కారం చూపిస్తుందని వెల్లడించింది.

నవంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈసారి ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల విధానంలో జరగనున్నాయి. అందుకోసం జీహెచ్ఎంసీ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పంపిన బ్యాలెట్ బాక్సులను మళ్లీ వెనక్కు రప్పిస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో చేపట్టిన ప్రాజెక్టులను కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ప్రారంభోత్సవాలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే హైటెక్ సిటీ వద్ద దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 11, 2020, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading