Home /News /politics /

TELANGANA SEC RELEASED GHMC ELECTIONS SCHEDULE NS

Breaking News: GHMC ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. డిసెంబర్ 1న ఎన్నికలు

ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్

ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్

జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. ఈ రోజు ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.

    జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబరు 1న పోలింగ్ నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి ప్రకటించారు. ఈ రోజు ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.  ఈ సారి మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించిన్నట్లు తెలిపారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని వివరించారు. 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.  21న వాటిని పరిశీలిస్తామన్నారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటిస్తామన్నారు. డిసెంబర్ 1 ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు.  ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ప్రకటించారు. 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది.

    Telangana SEC Released GHMC Elections Schedule GHMC, GHMC Elections Schedule, GHMC Elections Notification, జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్, జీహెచ్ఎంసీ నోటిఫికేషన్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్, గ్రేటర్ హైదరాబాద్
    ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన నోటిఫికేషన్ కాపీ


    గత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఈ సారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సారి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్ఈసీ ప్రకటనతో జీహెచ్ఎంసి పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Hyderabad - GHMC Elections 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు