19న తెలంగాణ బంద్... ఆర్టీసీ జేఏసీ పిలుపు

తన డిమాండ్ల పరిష్కారం కోసం ఐదురోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, నేతలు ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

news18-telugu
Updated: October 9, 2019, 4:43 PM IST
19న తెలంగాణ బంద్... ఆర్టీసీ జేఏసీ పిలుపు
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి,సీఎం కేసీఆర్ (File Photos)
  • Share this:
తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. తన డిమాండ్ల పరిష్కారం కోసం ఐదురోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, నేతలు ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. రేపు మరోసారి విపక్షాలతో ఆర్టీసీ కార్మిక నేతలు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ కేసీఆర్ నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ బంద్‌పై రుపు మధ్యాహ్నం ప్రకటన చేస్తామన్నారు అఖిలపక్ష నేతలు.

తెలంగాణ ఆర్టీసీ సమస్యలపై ఇవాళ అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను జేఏసీ నేతల్ని ఆహ్వానించారు.ఈ భేటీ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదన్నారు. ఆర్టీసీని బతికించుకోవడమే తమ లక్ష్యమన్నారు.సీఎం కేసీఆర్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. నేనే రాజు నేనే మంత్రి అన్న రీతిలో ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading