పొదల్లోకి తెలంగాణ ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు

తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: October 24, 2019, 4:54 PM IST
పొదల్లోకి తెలంగాణ ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు
పొదల్లోకి తెలంగాణ ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టి ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణిస్తున్న పదిహేను మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్ నుంచి బాన్స్‌వాడా వైపు వెళ్తున్న బస్సు మల్కాపూర్ గండి వద్ద ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొనడంతో... వారికికూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు బస్సులో నుంచి దూకారు. ఆర్టీసీ బస్సు రోజుకోచోట ప్రమాదానికి గురవుతుంది. తాత్కాలిక డ్రైవర్లు నిర్లక్ష్యంగా బస్సులు నడపడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కరించి మా ప్రాణాలను కాపాడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మెను కాదు.. ఆర్టీసినే ముగిస్తానన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీవి చిల్లర రాజకీయాలన్నారు. ఆర్టీసీ మునిగిపోవడం ఖాయమన్నారు గులాబీ బాస్, ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితమన్నారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం తీసుకుంటుందా ? అంటూ మండిపడ్డారు.
Published by: Sulthana Begum Shaik
First published: October 24, 2019, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading