కోడెల చివరి ఫోన్ కాల్‌పై పోలీసుల ఆరా ?

కోడెల చివరిసారిగా ఎవరితో ఫోన్‌లో మాట్లాడారనే అంశంపై పోలీసులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 17, 2019, 12:17 PM IST
కోడెల చివరి ఫోన్ కాల్‌పై పోలీసుల ఆరా ?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు
  • Share this:
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై రాజకీయ దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు పూర్తికాక ముందే ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అయితే కోడెల ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న తెలంగాణ పోలీసులు... ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. కోడెల ఆత్మహత్యకు గల కారణాలపై వారు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆత్మహత్య చేసుకోవడానికి కొద్ది నిమిషాల ముందు కోడెల ఫోన్‌లో 20 నిమిషాలు మాట్లాడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో కోడెలకు చివరగా ఫోన్ చేసింది ఎవరు ? వారితో ఆయన ఏం మాట్లాడారనే అంశంపై పోలీసులు విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కోడెల ఫోన్‌కు సంబంధించిన ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌పై విచారణ చేపట్టిన పోలీసులు... ఆయన చివరిసారిగా ఎవరితో మాట్లాడారు ? ఏం మాట్లాడారు అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి కోడెల ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటన్న అంశంపై పోలీసుల విచారణ ఓ కొలిక్కి వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

Published by: Kishore Akkaladevi
First published: September 17, 2019, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading