తల తీసుకోవాలన్నంత ఆక్రోశం వస్తోంది...విజయశాంతి ధ్వజం

రాష్ట్రంలోని మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో తెలంగాణ సర్కారు విఫలం చెందుతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి(Vijayashanthi) ఆరోపించారు.

news18-telugu
Updated: August 27, 2020, 7:43 AM IST
తల తీసుకోవాలన్నంత ఆక్రోశం వస్తోంది...విజయశాంతి ధ్వజం
సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)
  • Share this:
రాష్ట్రంలోని మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో తెలంగాణ సర్కారు విఫలం చెందుతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి ఆరోపించారు. ఏడాది కిందట జరిగిన దిశ ఘటన చేసిన గాయాలు ఇంకా ఆరకముందే... నిజామాబాద్‌లో మరో యువతిపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడటం మనసును కలచివేస్తోందన్నారు. సాక్షాత్తూ జిల్లా పరిపాలనా యంత్రాంగం కొలువై ఉండే కలెక్టరేట్‌కు సమీపంలోనే ఈ దారుణం జరిగిందన్నారు. గతంలో ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు, మహిళా రక్షణకు అంత చేస్తాం... ఇంత చేస్తామంటూ తెలంగాణ పాలకులు చెప్పిన కబుర్ల నీటిమీద రాతలేనని స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే అమీన్‌పూర్ ఆశ్రమంలో అనాథ బాలిక మృతి ఘటన కలకలం రేపుతూనే ఉందని విజయశాంతి గుర్తుచేశారు. ఎన్‌కౌంటర్లు సమర్థనీయం కానప్పటికీ, దిశ ఘటనలో నిందితులు తూటాలకు నేలకొరిగినా... పోలీసులంటే ఏ మాత్రం భయంలేని రీతిలో... మహిళా రక్షణ చట్టాలంటే ఏమాత్రం లెక్కలేనితనంతో కామాంధులు చెలరేగిపోతున్నారని... తెలంగాణలో ఆ చట్టాల అమలు ప్రభావం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతూనే ఉందని విమర్శించారు.

తెలంగాణలోని ఈ పరిస్థితులు రాష్ట్రంలోని మహిళలందరినీ తీవ్ర అభద్రతా భావంలోకి నెడుతున్నాయనే వాస్తవాన్ని కేసీఆర్ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. తన తెలంగాణలోని ఆడబిడ్డలపై కొందరు ఇంతటి హేయమైన నేరాలకు పాల్పడటం తల తీసుకోవాలనే ఆక్రోశాన్ని కల్పిస్తోందని విజయశాంతి పేర్కొన్నారు.
Published by: Janardhan V
First published: August 27, 2020, 7:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading