Telangana: CM KCR పరిపాలనా వైఫల్యాలపై పెద్ద గ్రంథమే రాయొచ్చు

ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం చెందిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి(Vijayashanti) ధ్వజమెత్తారు. కేసీఆర్ దొరగారి పరిపాలనా వైఫల్యాలపై పెద్ద గ్రంథమే రాయొచ్చంటూ ఆమె ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: August 18, 2020, 6:44 PM IST
Telangana: CM KCR పరిపాలనా వైఫల్యాలపై పెద్ద గ్రంథమే రాయొచ్చు
సీఎం కేసీఆర్, విజయశాంతి(ఫైల్ ఫోటోలు)
  • Share this:
కేసీఆర్ దొరగారి పాలనా వైఫల్యాలపై పెద్ద గ్రంథమే రాయొచ్చంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి(Vijayashanti) ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనంగా ఆమె పేర్కొన్నారు. చినుకు పడితే చాలు జలమయమయ్యే హైదరాబాదును ఎలాగూ కాపాడలేకపోయారని...ఇప్పుడు ప్రభుత్వ చేతగానితనానికి వరంగల్ కూడా బలైందని ఆరోపించారు. ఇక భూకబ్జాలను ఆపలేక రెవెన్యూ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తోందో ఈ మధ్య బట్టబయలైన కోటి రూపాయల లంచం ఘటనే చెబుతోందన్నారు. మరోవైపు పంటలు నీటమునిగి ఆవేదనలో ఉన్న అన్నదాతలను కనీసం స్థాయిలోనైనా ఆదుకోలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంటోందని ఆవేదన వ్యక్తంచేశారు.

తెలంగాణలో అత్యంత ప్రధానమైన ఆస్పత్రి... కోవిడ్ చికిత్సా కేంద్రంగానూ ఉన్న గాంధీ ఆస్పత్రి పలుమార్లు అగ్నిప్రమాదానికి గురైనా అక్కడ ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నీరుగారి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుందని విజయశాంతి విమర్శించారు. ఇక కోవిడ్ చికిత్సా వ్యవస్థ అనేది అటు ప్రభుత్వాసుపత్రులు, ఇటు ప్రయివేట్ ఆసుపత్రుల్లోనూ కుప్పకూలిపోయిందనడానికి హైకోర్టు వేసిన మొట్టికాయల గాయాలే సాక్ష్యమన్నారు. ప్రభుత్వ తీరుపై వైద్యులు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, పారిశుద్ధ్య కార్మికుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ దొరగారి పరిపాలనా వైఫల్యంపై పెద్ద గ్రంథమే రాయవచ్చని ఎద్దేవా చేశారు. ఇకనైనా మేలుకొని పరిపాలనా వ్యవస్థను చక్కదిద్దాలంటూ సీఎం కేసీఆర్‌ను విజయశాంతి డిమాండ్ చేశారు.
Published by: Janardhan V
First published: August 18, 2020, 6:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading