తెలంగాణ ప్రజలు మావైపే.. 80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం: ఉత్తమ్

Telangana assembly elections2018|తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ సరళిని బట్టి ప్రజలంతా తమవైపే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

news18-telugu
Updated: December 8, 2018, 2:19 PM IST
తెలంగాణ ప్రజలు మావైపే.. 80 సీట్లతో ప్రజాకూటమి ప్రభుత్వం: ఉత్తమ్
ఉత్తమ్ కుమార్ రెడ్డి (File)
  • Share this:
తెలంగాణలో కేసీఆర్ పాలన ముగిసిందని, రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తమకున్న సమాచారం మేరకు 75 నుంచి 80 సీట్లు సాధించి.. డిసెంబర్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు తమ పట్ల పాజిటివ్ వైఖరితో ఉన్నారని చెప్పారు.

పోలింగ్ రోజున బీజేపీ కార్యకర్తల దాడిలో గాయపడి.. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని ఉత్తమ్ పరామర్శించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించి భయానక వాతావరణం సృష్టించారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తమ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్న.. జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేశారు. జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేలకు విశ్వసనీయత లేదని, ఇదివరకు చాలా రాష్ట్రాల్లో ఆ సర్వేలు తప్పయ్యాయని చెప్పారు. ఇండియా టుడే జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరెన్ని సర్వేలు చేసినా.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ నేత‌ృత్వంలోని ప్రజాఫ్రంట్ ప్రభుత్వమేనని ఉత్తమ్ స్పష్టం చేశారు.
Published by: Santhosh Kumar Pyata
First published: December 8, 2018, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading