Home /News /politics /

TELANGANA PCC CHIEF REVANTH REDDY WROTE OPEN LETTER TO CM KCR OVER ALLEGATIONS ON RAJATH KUMAR DAUGHTER MARRIAGE EXPENDITURE PRV

Revanth Reddy: సీఎం కేసీఆర్​కు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ.. ఆ వార్తా కథనంపై స్పందించాలని డిమాండ్​

revanth reddy

revanth reddy

ఐఏఎస్​ అధికారి రజత్​కుమార్​ కుమార్తె వివాహం రాజకీయంగా మలుపులు తిరుగుతోంది. రజత్​కుమార్​ కుమార్తె వివాహం హైదరాబాద్​లోని ప్రముఖ ఫైవ్​ స్టార్​ హోటళ్లలో జరిపారని వాటికి మాత్రం బిల్లులను ఓ ప్రముఖ కంపెనీ చెల్లించిందనేది ఆరోపణ.

    ఐఏఎస్​ అధికారి రజత్​కుమార్​ కుమార్తె వివాహం (IAS officer Rajath Kumar daughter marriage) రాజకీయంగా మలుపులు తిరుగుతోంది. రజత్​కుమార్​ కుమార్తె వివాహం హైదరాబాద్​లోని ప్రముఖ ఫైవ్​ స్టార్​ హోటళ్లలో జరిపారని వాటికి మాత్రం బిల్లులను (IAS officer Rajath Kumar daughter marriage Expenditure) ఓ ప్రముఖ కంపెనీ చెల్లించిందనేది ఆరోపణ. దీనిపై న్యూస్​ మినిట్​ ఓ ప్రత్యేక కథనం రాసింది. అయితే నీటి పారుదల శాఖలో రజత్​కుమార్​ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండటంతో ఈ అంశం రచ్చగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.  ఈ నేపథ్యంలో రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth reddy) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన శుక్రవారం లేఖ రాశారు.

    సీఎంకు రాసిన బహిరంగ లేఖలో.. 

    మీరు ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టులో అవినీతి పై "ది న్యూస్ మినిట్" అనే న్యూస్ పోర్టల్ ఆధారాలతో సహా ఒక కథనాన్ని ప్రచురించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోన్న సీనియర్ ఐఎఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఇరిగేషన్) రజత్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని ఆ పోర్టల్ ఓ కథనంలో పేర్కొంది. రజత్ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులను (IAS officer Rajath Kumar daughter marriage Expenditure) కాళేశ్వరం కాంట్రాక్టు పొందిన మెసూ, దాని పిల్ కంపెనీలు చెల్లించినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 17 - 21 మధ్య రజత్ కుమార్ కుమార్తె వివాహ వేడుకలను హైదరాబాద్ నగరంలోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్, తాజ్ డెక్కన్, తాజ్ కృష్ణా వంటి ఐదు స్టార్ హోటళ్లలో నిర్వహించినట్టు కథనంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఖర్చులను 'బిగ్ వేవ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, 'ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్' అనే పిల్ కంపెనీలు చెల్లించినట్టు ఆ పోర్బల్ ఒక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.

    ఈ షెల్ కంపెనీలకు కాళేశ్వరం కాట్రాక్టులు (Kaleswaram Contracts) పొందిన 'మేఘా! కంపెనీకి సంబంధాలు ఉన్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. కాళేశ్వరంలో అవినీతిపై ఇప్పటికీ పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పోర్టల్ కథనంలో వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా భావించాల్సి ఉంటుంది. సాగునీటి శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో మీరే నిర్వహిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారి రజత్ కుమార్ మీ పర్యవేక్షణలోనే పని చేస్తున్నారు. ఆయన పై ఆరోపణలు వచ్చి 48 గంటలు కావస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఖండన కానీ, వివరణ కానీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మీ పేషీలో పని చేసే అధికారిపై ఇంతటి తీవ్ర ఆరోపణలు వస్తే మీరు తేలుకుట్టిన దొంగల్లా ఉండటం సరికాదు.

    క్విడ్ ప్రో కో వ్యవహారంగా..

    రజత్ కుమార్ కుమార్తె వివాహానికి (IAS officer Rajath Kumar daughter marriage) సంబంధించి పలు హోటళ్లు, ప్యాలెస్ లలో గదులు బుక్ చేయడానికి కంపెనీ ఉద్యోగులు మురళీ, ప్రమీలన్ ఫేక్ మెయిల్ ఐడీలు ఉపయోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలను తొలుత రజత్ కుమార్ చూసుకోగా... ఆ తర్వాత ఆయన ఓఎస్టీ ప్రభాకర్ 3/5 సమన్వయం చేసుకున్నట్టు తెలుస్తోంది. న్యూస్ పోర్టల్ కథనం... అందులోనే పేర్కొన్న ఆధారాలను పరిశీలిస్తే ఇది పూర్తిగా క్విడ్ ప్రో కో వ్యవహారంగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై వాస్తవాలను తెలంగాణ సమాజానికి వెల్లడించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను.

    చిరునామా కూడా ఫేక్..

    రజత్ కుమార్ కుమార్తె వివాహానికి కొన్ని నెలల ముందు 2021 జూన్ లో బిగ్ వేవ్ ఇన్ ప్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించారు. బిల్డింగ్ ఇన్ స్టాలేషన్ పనుల కోసం రిజిస్టర్ చేసిన ఈ కంపెనీలో సంధ్యా అగర్వాల్, అనూష డైరెక్టర్లుగా ఉన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్ పురాలో తమ కార్యాలయం అని ఈ సంస్థ ఇచ్చిన చిరునామా కూడా ఫేక్ అని తేలినట్టు చెబుతున్నారు. ఈ పేరుతో అక్కడ ఎలాంటి కంపెనీ లేదని తెలిసింది. ఇది అవినీతి ఆరోపణలకు మరింత బలం చేరుతోంది.

    బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఎందుకు..?

    రజత్​ కుమార్ కుమార్తె వివాహ ఖర్చులను (IAS officer Rajath Kumar daughter marriage Expenditure) సదరు షెల్ కంపెనీలు చెల్లించాయంటే.. ఆ కంపెనీలకు ఆయన చేకూర్చిన లబ్ది ఏమిటనే విషయంలో స్పష్టత రావాలి. ఎటువంటి సంబంధం లేకుండా రజత్ కుమార్ కుమార్తె వివాహానికి రూ.50 లక్షల పై చిలుకు బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఈ పిల్ కంపెనీలకు ఎందుకు ఉంటుంది? రజత్ కుమార్ కు, ఈ కంపెనీలకు మధ్య జరిగిన లావాదేవీలు, అందులో వాస్తవాలు బయటకు రావడానికి ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒక్క అధికారికి రూ.50 లక్షలు ముట్టాయంటే ప్రభుత్వంలోని పెద్దలకు, ఇతర అధికారులకు ఏ మేరకు ముట్టి ఉంటాయో అన్న అనుమానం తెలంగాణ సమాజంలో ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలోని పెద్దలకు ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి వేల కోట్ల ముడుపులు అందినట్టు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి.

    ఉన్నత స్థాయి విచారణ అవసరం..

    మీ పేషీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేయాలి. ఈ ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. విచారణ పూర్తయ్యే వరకు రజత్ కుమార్. ను పోస్టింగ్ కు దూరంగా ఉంచాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీకి కూడా ఎటువంటి కాంట్రాక్టులు ఇవ్వకూడదు.

    సీఎంవోలో సీనియర్ ఐఎఎస్ అధికారి (IAS Officer) పై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చి 48 గంటలు కావస్తున్నా మీరు స్పందించకపోవడం పై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాగునీటి శాఖను కూడా మీరే నిర్వహిస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ( (Kaleswaram Project) )లో అవినీతిపై వస్తోన్న ఆరోపణల్లో పారదర్శకంగా వ్యవహరించి, నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మీ పేషీలోని కీలక అధికారిపై ఆరోపణలు వస్తే తేలుకుట్టిన దొంగల్లా ఎందుకు ఉంటున్నారని తెలంగాణ సమాజం భావిస్తోంది. తక్షణం మీరు స్పందించాల్సిన అవసరం ఉంది.

    డిమాండ్లు..

    • అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పేషీలోని సీనియర్ ఐఎఎస్ అధికారి రజత్ కుమార్, పిల్ కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీల పై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరిపించాలి.

    • కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇతర అధికారులతో పాటు, ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరపాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలి.

    • ఈ డిమాండ్లపై మీరు స్పందించకుంటే మీ వ్యవహార శైలిని కూడా ప్రజలు అనుమానించే పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టులో అవినీతిపై కొన్నాళ్లుగా జరుగుతోన్న ప్రచారం నిజమని నమ్మాల్సి ఉంటుంది”అని రేవంత్​ రెడ్డి లేఖలో తెలిపారు.

    దీంతో ఇపుడు బంతి కేసీఆర్​ కోర్టులో పడినట్లుగా ఉంది. దీనిపై అధికార పార్టీ నేతలు ఇంకా స్పందించలేదు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Revanth Reddy, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు