తెరపైకి కొత్త టీపీసీసీ చీఫ్.. రేసులో ఉన్న నలుగురు వీరే..

రేసులో ఉన్న నలుగురు ముఖ్యనేతల్లో ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుడే.

news18-telugu
Updated: June 23, 2019, 8:23 PM IST
తెరపైకి కొత్త టీపీసీసీ చీఫ్.. రేసులో ఉన్న నలుగురు వీరే..
ఉత్తమ్ కుమార్, రాహుల్ గాంధీ
  • Share this:
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తర్వాత తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం హస్తం నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మరోసారి తెరపైకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్‌ను మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో మరో కొత్త వ్యక్తికి తెలంగాణ పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. దీంతో ఎవరైతే పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరనే అంశాలపై తెలంగాణలోని కాంగ్రెస్ ముఖ్యనేతలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేసులో నలుగురి పేర్లు ఉన్నట్టు సమాచారం. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లను ప్రాధమికంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అయితే, అందులో ఎవరిని ఎంపిక చేస్తారనేది సస్పెన్స్. 2015 నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 23, 2019, 8:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading