ఆ విషయంలో జగన్‌ భేష్.. భళా అంటూ ప్రతిపక్షాల పొగడ్తల వర్షం

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సమావేశమైన తెలంగాణ విపక్షాలు.. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలు అభినందిస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు.

news18-telugu
Updated: October 9, 2019, 9:22 PM IST
ఆ విషయంలో జగన్‌ భేష్.. భళా అంటూ ప్రతిపక్షాల పొగడ్తల వర్షం
సీఎం వైఎస్ జగన్ (File Photos)
news18-telugu
Updated: October 9, 2019, 9:22 PM IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ప్రతిపక్షాలు ప్రశంసల వర్షం కురిపించాయి. అయితే, ఏపీలో ప్రతిపక్షాలు కాదు. తెలంగాణలో ప్రతిపక్షాలు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలు అభినందిస్తూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద విమర్శలు గుప్పించారు. ఏపీలో జగన్ చేపట్టిన పలు సంక్షేమ పథకాలను అభినందించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ మోహన్ రెడ్డిని అభినందనల్లో ముంచెత్తారు. జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు. అలాగే, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు పెట్టిన కండిషన్ల మీద కూడా పొగడ్తలు గుప్పించారు. విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆయా పార్టీలకు రాజీనామా చేసిన తర్వాతే అధికార పార్టీలోకి రావాలని పెట్టిన కండిషన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. అలాగే, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తుంటే, తెలంగాణలో సీఎం కేసీఆర్ మాత్రం ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు చురకలు అంటించారు.

Viral Video : దారినపోయే వ్యక్తిని తొక్కి చంపబోయిన ఆవుFirst published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...