TELANGANA NIZAMABAD ELECTION MAY BE UPTO RS 35 CRORES DUE TO 185 CANDIDATES IN CONTEST AK
బరిలో 185 మంది... నిజామాబాద్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా...
ప్రతీకాత్మక చిత్రం
భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండటంతో... నిజామాబాద్ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతోనే జరుగుతాయని చాలామంది భావించారు. అయితే ఈసీ మాత్రం ఈవీఎంలతోనే ఈ ఎన్నికల జరుగుతుందని స్పష్టం చేసింది.
దేశంలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే... ఈ సారి నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల కాస్త ప్రత్యేకంగా మారింది. 170 మంది రైతులు ఈ సారి ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. తమ పంటకు మద్దతు ధర ఇవ్వడంతో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే ఆగ్రహంతో... ఎన్నికను ఆపాలనే ఉద్దేశ్యంతో పసువు, ఎర్ర జొన్నలు రైతులు పెద్ద సంఖ్యలో ఎన్నికల బరిలో నిలిచారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండటంతో... నిజామాబాద్ ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతోనే జరుగుతాయని చాలామంది భావించారు.
అయితే ఈసీ మాత్రం ఈవీఎంలతోనే ఈ ఎన్నికల జరుగుతుందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున అభ్యర్థులు బరిలో ఉండటంతో ఈ ఎన్నిక ఖర్చు రూ. 35 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి రూ. 15 కోట్ల వరకు ఖర్చు అవుతుండగా... నిజామాబాద్ ఎన్నికలకు మాత్రం అదనంగా మరో రూ. 20 కోట్లు వరకు ఖర్చు కావొచ్చని సమాచారం. నిజామాబాద్ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున ఈవీఎంలను వినియోగించాల్సి ఉంది. ఇందులో భాగంగా 12 బ్యాలెట్ యూనిట్లను ఎల్ ఆకారంలో ఉన్న కంట్రోల్ యూనిట్‌కు అమర్చుతారు.
ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఎం3 టైప్ ఈవీఎంలను వినియోగించనుంది. ఈవీఎంలలో సమస్యలు తలెత్తితే సరి చేయడానికి నిజామాబాద్ మొత్తంగా 600 మంది ఇంజినీర్లను అందుబాటులో ఉంచనున్నారు. సాధారణంగా ప్రతి పది పోలింగ్ స్టేషన్లకు ఒక మేజిస్ట్రేట్ ఉండాలి. అయితే నిజామాబాద్‌లో మాత్రం ప్రతి ఐదు పోలింగ్ స్టేషన్లకు ఒక మేజిస్ట్రేట్ ఉంటారు. ఒకవేళ పెద్దఎత్తున ఈవీఎంలను తరలించాల్సి వస్తే... అందుకోసం ఓ హెలికాప్టర్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా ఈ ఎన్నికల ఖర్చు భారీగా పెరగడానికి మరో కారణం.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.