Home /News /politics /

TELANGANA NEWS SUSPENSE OVER CM KCR STRATEGY IN HUZURABAD BY ELECTIONS WILL TARGET ETELA RAJENDAR OR BJP AK

Telangana Politics: ఈటల రాజేందరా ? బీజేపీనా ?.. హుజూరాబాద్‌లో కేసీఆర్ వ్యూహంపై సస్పెన్స్

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana News: సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ విషయంలో ఏ వ్యూహంతో ముందుకు సాగుతున్నారన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు.

    హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ.. అక్కడ మాత్రం రాజకీయ వేడి పతాకస్థాయికి చేరుకుంది. ఓ వైపు మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రజల్లో తిరుగుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు ఈటలను ఓడించేందుకు టీఆర్ఎస్ కూడా అంతే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగిపోయారు. ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడిని పంచారు. మాజీ సహచరుడిని చిరకాల ప్రత్యర్థి స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలను, ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ రాజకీయ దాడిని తీవ్రతరం చేసిందనే విషయం అర్థమవుతోంది.

    హరీశ్ రావు మాటలను బట్టి ఈటలపై టీఆర్ఎస్ వ్యూహం అర్థమైంది. అయితే ఈ నెల 16న జమ్మికుంటలో దళితబంధు పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్.. అక్కడ ఏం మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నికపై గ్రౌండ్ వర్క్ చేస్తున్న కేసీఆర్.. ఇప్పటివరకు నేరుగా ఈటల రాజేందర్‌పై మాత్రం విమర్శలు చేయలేదు. ఆయనపై పరోక్షంగానూ కామెంట్స్ చేయలేదు. దీంతో జమ్మికుంట సభలో సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌పై విమర్శల దాడిని మొదలుపెడతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

    అయితే సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ విషయంలో ఏ వ్యూహంతో ముందుకు సాగుతున్నారన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేయకుండా బీజేపీ విధానాలను విమర్శిస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ముందుకు సాగాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాలను విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని.. వాటిపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తే ఈటల రాజేందర్‌ను ఓడించడం మరింత ఈజీ అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

    అందుకే టీఆర్ఎస్ పథకాలు వర్సెస్ బీజేపీ విధానాలు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికలను మలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉండదనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ ప్రాతిపదికగా ఎన్నికలు జరిగితే.. అది టీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని గులాబీ బాస్ అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా.. హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభానికి సిద్ధమైన సీఎం కేసీఆర్.. అక్కడ ఎలాంటి కామెంట్స్ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Etela rajender, Huzurabad By-election 2021, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు