హోమ్ /వార్తలు /National రాజకీయం /

Revanth Reddy: రేవంత్ రెడ్డికి అనుకోని విధంగా కలిసొచ్చిన కేసీఆర్ నిర్ణయం..

Revanth Reddy: రేవంత్ రెడ్డికి అనుకోని విధంగా కలిసొచ్చిన కేసీఆర్ నిర్ణయం..

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనదైన వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఒక్కొక్కటికి వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

  తెలంగాణ రాజకీయాలు కొద్ది నెలల నుంచి హుజూరాబాద్ నుంచే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నిక తమకు ముఖ్యంకాదని రాజకీయ పార్టీలు పైకి పదే పదే చెబుతున్నా.. ఇక్కడ గెలిచి తీరాలని కొన్ని పార్టీలు.. సత్తా చాటి తమ ఉనికిని నిలుపుకోవాలని మరికొన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ ఈ సీటును గెలుచుకోవడానికి అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తుండగా.. బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ తన గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గంలోనే పర్యటనలు చేస్తున్నారు. అయితే హుజూరాబాద్ నియోజవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ దూకుడుతో పోల్చితే కాంగ్రెస్ బాగా వెనుకబడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎవరో కూడా ప్రకటించకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కావాలనే వ్యూహాత్మకంగా ఈ విషయంలో జాప్యం చేస్తోందా అనే ప్రచారం కూడా సాగుతోంది.

  కారణాలు ఏమైనా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక మరో రెండు మూడు నెలల వరకు లేనట్టే అని క్లారిటీ రావడం టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డికి చాలావరకు కలిసొచ్చే అంశమే అనే ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ఉప ఎన్నిక తొలి అగ్నిపరీక్ష కానుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధించకపోయినా.. గౌరవప్రదమైన ఫలితాలు సాధిస్తేనే రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అందుకే ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని రేవంత్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం కొండా సురేఖను ఆయనే స్వయంగా మాట్లాడి ఒప్పించారని టాక్.

  అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తుందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఉప ఎన్నిక మరికొన్ని నెలల తరువాతే జరిగే అవకాశం ఉండటంతో.. రేవంత్ రెడ్డి హుజూరాబాద్ అంశాన్ని పక్కనపెట్టేందుకు అవకాశం దక్కిందనే వాదన వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డికి హుజూరాబాద్ ఉప ఎన్నిక వ్యవహారం ఇబ్బందిగా మారిందనే చర్చ కూడా ఉంది. అయితే ఇప్పుడు అనుకోకుండా ఈ ఉప ఎన్నిక కోసం వచ్చిన మరికొంత సమయం ఆయనకు పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయడానికి కలిసొస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

  BJP: రేవంత్ రెడ్డి టార్గెట్‌గా బీజేపీ ప్లాన్.. రంగంలోకి ముఖ్యనేతలు.. కొంతవరకు సక్సెస్ సాధించిందా ?

  Heart Attack: గుండెపోటు ఎక్కువగా వచ్చేది ఈ రోజే.. అధ్యయనంలో వెల్లడి.. కారణం ఏంటంటే..

  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనదైన వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి.. ఒక్కొక్కటికి వాటిని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆయన ప్లాన్‌కు కొంతమేర ఇబ్బందిగా మారుతుందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఈ ఉప ఎన్నిక నిర్వహణ ఇప్పట్లో వద్దని తెలంగాణ ప్రభుత్వం సూచించడం.. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓకే చెప్పడంతో.. ఈ ఎన్నికకు మరికొంత సమయం పట్టనుంది. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడటంతో.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డికి కలిసొచ్చిందనే టాక్ మొదలైంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Congress, Huzurabad By-election 2021, Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు