హరీశ్‌రావుతో 18 ఏళ్ల అనుబంధం.. ఆయన చేతికి వచ్చేలోపే టీఆర్ఎస్ ఖతం.. దుబ్బాక రిపీట్ అవుతుందన్న ఈటల

హరీశ్ రావు, ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Etela Rajendar Versus Harish Rao: కేసీఆర్ నియోజకవర్గం ఇస్తే హరీశ్ రావు గెలుస్తున్నాడని.. తనకు ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలు.. ఆ తరువాత ఓటమి లేకుండా గెలిపిస్తున్నారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.

 • Share this:
  తనపై విమర్శలు చేసిన మంత్రి హరీశ్ రావుపై మాజీమంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరికీ 8 సంవత్సరాల అనుబంధం ఉందని.. అవన్నీ మర్చిపోయి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టడానికి ఇవ్వన్నీ చెయొద్దని సూచించారు. హరీశ్ రావు ఎంత పని చేసిన కేసీఆర్ ఆయనను నమ్మడని అన్నారు. ఎఫ్పటికైనా టీఆర్ఎస్‌ను సొంతం చేసుకోవాలని హరీశ్ రావు అనుకుంటున్నాడని.. అయితే కేసీఆర్ ఉండగానే టిఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. హరీశ్ రావు చేతికి వచ్చే లోపు టీఆర్ఎస్ ఖతమ్ అవుతుందని వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చరిత్ర క్షమించదని.. ధర్మానికి, న్యాయానికి విరుద్దంగా పని చేస్తే అదే గతి పడుతుందని హెచ్చరించారు.

  కేసీఆర్ నియోజకవర్గం ఇస్తే హరీశ్ రావు గెలుస్తున్నాడని.. తనకు ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలు.. ఆ తరువాత ఓటమి లేకుండా గెలిపిస్తున్నారని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో అభివృద్ది జరగలేదు అంటున్న హరీశ్ రావు.. నిన్న తాను వేయించిన నాలుగు లైన్ల రోడ్డు మీదే తిరిగారని అన్నారు. అభివృద్ది విషయంలో వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో తనకు అంతే చిత్తశుద్ధి ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత హుజూరాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చానని అన్నారు.

  నియోజకవర్గంలో 18 చెక్ డామ్‌లు కట్టానని అన్నారు. తనతో పాటు 11 మంది సొంత నేతలను ఓడించేందుకు కేసీఆర్ ప్రతిపక్ష నేతలకు డబ్బులు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఖజానాలో డబ్బులు నిండుగా ఉంటే మధ్యాహ్న భోజనం పథకం వారికి డబ్బులు ఇవ్వడం లేదని ఈటల ప్రశ్నించారు. ఎందుకు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: