హోమ్ /వార్తలు /National రాజకీయం /

Huzurabad: హుజూరాబాద్‌లో పోటీకి దూరం.. ఆ పార్టీ ప్రకటన.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా ?

Huzurabad: హుజూరాబాద్‌లో పోటీకి దూరం.. ఆ పార్టీ ప్రకటన.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Politics: హుజూరాబాద్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ తెర వెనుక మంతనాలు చేపట్టే అవకాశం లేకపోలేదని చర్చ రాజకీయవర్గాల్లో బలంగా సాగుతోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ ఎలా ఉండబోతోందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇక్కడ ప్రధాన పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ కూడా ఇక్కడ ఈ రెండు పక్షాలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. త్వరలోనే తమ అభ్యర్థిని ప్రకటించి హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం పర్వంలోకి దిగాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇదిలా ఉంటే మిగతా చిన్న పార్టీలు ఇక్కడి నుంచి పోటీ చేస్తాయా ? అనే చర్చ కొంతకాలంగా సాగుతోంది. అయితే తాజాగా హుజూరాబాద్‌లో పోటీ చేసే అంశంపై సీపీఐ పార్టీ క్లారిటీ ఇచ్చింది. హుజూరాబాద్‌లో త్వరలో జరుగబోయే ఉపఎన్నికలో సీపీఐ పోటీ చేయదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఏ పార్టీకి మద్దతు ఇచ్చే విషయాన్ని త్వరలో రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో చర్చించి, నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపిస్తుందని ఎవరూ ఊహించలేరు. ప్రధాన పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న కారణంగానే.. ఇక్కడ పోటీలో ఉండకూడదని సీపీఐ భావించి ఉండొచ్చనే చర్చ కూడా సాగుతోంది. అయితే మరో పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. బీజేపీకి సీపీఐ ఎలాగూ మద్దతు ఇవ్వదు కాబట్టి.. బరిలో ఉన్న మరో రెండు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ వస్తున్న సీపీఐ.. ఈ రెండు పార్టీల్లో ఎవరికి మద్దతు ఇస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. ఈ ఎన్నిక కోసం సీపీఐ మద్దతు తీసుకునే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో సీపీఐ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని.. అందుకే ఈ రకమైన ప్రకటన చేసి ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. గతంలో పలు ఉప ఎన్నికల సందర్భంగా సీపీఐ టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Telangana: రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. టీఆర్ఎస్ కీలక నేతపై ఫోకస్.. వర్కవుట్ అవుతుందా ?

Night: రాత్రిపూట తరచూ గొంతు తడారిపోతుందా ?.. చాలా డేంజర్.. దేనికి సంకేతమో తెలుసా..

మరోవైపు హుజూరాబాద్‌లో ఏ పార్టీకి మద్దతు ఇస్తామనే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సీపీఐ.. ఈ విషయంలో కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని కూడా ఊహించలేమని పలువురు చెబుతున్నారు. గతంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ సీపీఐ ఇలాంటి ప్రకటన చేసిందని.. చివరకు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉండిపోయిందని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సీపీఐ మద్దతు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ తెర వెనుక మంతనాలు చేపట్టే అవకాశం లేకపోలేదని చర్చ రాజకీయవర్గాల్లో బలంగా సాగుతోంది.

First published:

Tags: Bjp, Congress, CPI, Dalitha Bandhu, Etela rajender, Huzurabad By-election 2021, Revanth Reddy, Telangana, Trs

ఉత్తమ కథలు