హోమ్ /వార్తలు /National రాజకీయం /

Huzurabad: ‘హుజూరాబాద్’ కోటాలో మరో రెండు పదవులు..ఆ ఇద్దరికి ఛాన్స్.. కేసీఆర్ ఆలోచన ?

Huzurabad: ‘హుజూరాబాద్’ కోటాలో మరో రెండు పదవులు..ఆ ఇద్దరికి ఛాన్స్.. కేసీఆర్ ఆలోచన ?

'సీఎం కేసిఆర్

'సీఎం కేసిఆర్

Huzurabad: కొద్దిరోజుల క్రితం బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు.

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హుజూరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. పైకి అలాంటిదేమీ లేదని నేతలు చెబుతున్నా.. అన్ని రాజకీయ పార్టీలు హుజూరాబాద్‌పై దృష్టి పెట్టాయి. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగనున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. హుజూరాబాద్‌లో ఎక్కువగా ఉన్న దళితులను తమ వైపు ఆకర్షించేందుకే టీఆర్ఎస్ దళితబంధు పథకం తీసుకొచ్చిందనే విమర్శలను కూడా ప్రతిపక్షాలు ఎక్కువగా చేస్తున్నాయి. ఇక ఉప ఎన్నిక కారణంగా హుజూరాబాద్ నేతలకు పదవులు కూడా బాగానే వస్తున్నాయి. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ, బండా శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, వకుళాభరణం కృష్ణమోహన్‌రు బీసీ కమిషన్ చైర్మన్ పదవిని ప్రభుత్వం కట్టబెట్టింది. వీరితో పాటు హుజూరాబాద్‌కు చెందిన మరికొందరు నేతలకు నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఈటల రాజేందర్ అనుచరుడు, ఆయన సామాజికవర్గానికి చెందిన పింగళి రమేశ్ ఉన్నట్టు తెలుస్తోంది.

కొద్దిరోజుల క్రితం బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. తాజాగా ఆయనకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. కేబినెట్ ర్యాంక్‌తో కూడిన ఈ పదవిని ఇవ్వడం ద్వారా గతంలో మంత్రిగా పని చేసిన సీనియర్ నేత పెద్దిరెడ్డికి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన మరో నేత పింగళి రమేశ్‌కు ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత యోచిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Huzurabad: టీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. హుజూరాబాద్‌లో ఆ పార్టీ బరిలోకి దిగుతుందా ?

త్వరలోనే దీనిపై సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గం కాకపోయినా.. ఈ నియోజకవర్గంపై ప్రభావం చూపుతారని భావిస్తున్న మాజీమంత్రి, టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన అనేక మంది నేతలకు పదవులు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

First published:

Tags: CM KCR, Huzurabad By-election 2021, Telangana

ఉత్తమ కథలు