రూ. 400 కోట్లతో సచివాలయం... రూ. 100 కోట్లతో అసెంబ్లీ నిర్మాణం... తెలంగాణ కేబినెట్ నిర్ణయం

మంచి రోజులు ముగుస్తున్నందున ఈ నెల 27న కొత్త సచివాలయం నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అత్యాధునికంగా నిర్మించబోయే కొత్త సచివాలయానికి రూ. 400 కోట్ల మేర ఖర్చవుతుందని ఆయన తెలిపారు.

news18-telugu
Updated: June 18, 2019, 9:22 PM IST
రూ. 400 కోట్లతో సచివాలయం... రూ. 100 కోట్లతో అసెంబ్లీ నిర్మాణం... తెలంగాణ కేబినెట్ నిర్ణయం
కొత్త సచివాలయం నమూనా (File)
  • Share this:
తెలంగాణ మంత్రివర్గం కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం సచివాలయంలోని తమ భవనాలను అప్పగించడంతో... ప్రస్తుత సచివాలయం ఉన్న చోటే కొత్త సచివాలయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మంచి రోజులు ముగుస్తున్నందున ఈ నెల 27న కొత్త సచివాలయం నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అత్యాధునికంగా నిర్మించబోయే కొత్త సచివాలయానికి రూ. 400 కోట్ల మేర ఖర్చవుతుందని ఆయన తెలిపారు.

ఇక ఎర్రమంజిల్‌లో తెలంగాణ కొత్త అసెంబ్లీ, మండలి భవనాలను నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్... ఇందుకోసం రూ. 100 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. కొత్త సచివాలయం నిర్మాణం కోసం ప్రస్తుతం సచివాలయంలో ఉన్న అన్ని భవనాలను కూల్చేయాలా ? లేక కొన్ని భవనాలను మాత్రమే కూల్చాలా ? అన్న అంశంపై మంత్రుల కమిటీ వేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త అసెంబ్లీ, మండలి నిర్మించినా... ప్రస్తుతం ఉన్న పాత అసెంబ్లీ, మండలి భవనాలు అలాగే ఉంటాయని కేసీఆర్ వివరించారు. వాటిని వారసత్వ సంపదగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కొత్త అసెంబ్లీ లుక్ కూడా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ తరహాలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు.


First published: June 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>