తెలంగాణలో మరో ఉప ఎన్నిక, నాగార్జున సాగర్ బైపోల్స్ అప్పుడే

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా వైరస్‌తో మరణించారు. ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ రెండు స్థానాలకు ఒకేసారి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని, మార్చిలో నోటిఫికేషన్ రావొచ్చని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు.

 • Share this:
  తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాలమరణం చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల సీటు కోల్పోయి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న టీఆర్ఎస్ పార్టీ మరోసారి అలా జరగకూడదని భావిస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ నేతలకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా వైరస్‌తో మరణించారు. ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ రెండు స్థానాలకు ఒకేసారి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని, మార్చిలో నోటిఫికేషన్ రావొచ్చని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు.

  ఏపీలో వారికి నెలకు రూ.10వేలు, సీఎం జగన్ ముందు ప్రతిపాదన

  ఉపాధ్యాయ దినోత్సవం లాగా జగన్ బర్త్ డే రోజున ఏపీలో ప్రత్యేక దినోత్సవం

  గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించడంపై ఫోకస్ పెట్టడంతో టీఆర్ఎస్ కూడా అప్రమత్తమైంది. జానారెడ్డి కుటుంబాన్ని బీజేపీలోకి తీసుకొచ్చి... ఆయన లేదా ఆయన కుమారుడిని పార్టీ తరపున బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గతంలో ఇక్కడి నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలిచిన జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి బీజేపీ తరపున బరిలోకి దిగితే టీఆర్ఎస్‌కు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయమనే భావనలో కమలనాథులు ఉన్నారు. అయితే, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రెండేళ్ల పదవీకాలం మాత్రమే ఉండే ఈ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని.. ఈ ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తాడని జానారెడ్డి తెలిపారు. అంతేకాదు తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని అన్నారు.

  ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 2021 ఏప్రిల్ నుంచి మీ టేక్ హోమ్ జీతం తగ్గబోతోంది..

  TATA Cars offers: డిసెంబర్‌లో టాటా కార్ల బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ డబ్బులతో బైక్ కూడా కొనొచ్చు

  ఈ క్రమంలోనాగార్జున సాగర్ కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికల నాటికి సుమారు రూ.100 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యనేతలు, కార్యకర్తలు అంతా కార్యక్షేత్రంలో ఉండాలలన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనకే తెలియజేయాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి చాన్స్ ఇవ్వకూడదని కేసీఆర్ భావిస్తున్నారు.

  ఇలాంటి లక్షణాలుంటే Demisexual అంటారు.. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి

  Health Tips: మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే 7 ఉత్తమ మార్గాలు


  నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం ఓట్ల సంఖ్య 208176 ఉండగా.. 2018లో 179955 ఓట్లు పోలయ్యాయి. విజేతగా నిలిచిన నోముల నర్సింహయ్యకు 83655 ఓట్లు రాగా.. రెండు స్థానంలో నిలిచిన జానారెడ్డికి 75884 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థికి 9819 ఓట్లు రాగా.. నాలుగో స్థానంలో నిలిచిన కంకణాల నివేదికకు 2675 ఓట్లు వచ్చాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: