చీప్ లిక్కర్ వద్దు... బ్రాండెడ్ లిక్కరే ముద్దు

Telangana Municipal Polls 2020 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొత్త సిత్రాలు కనిపిస్తున్నాయి. ఏదో అనుకుంటే... ఇంకేదో అవుతోందని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఆ కథేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 13, 2020, 2:29 PM IST
చీప్ లిక్కర్ వద్దు... బ్రాండెడ్ లిక్కరే ముద్దు
చీప్ లిక్కర్ వద్దు... బ్రాండెడ్ లిక్కరే ముద్దు
  • Share this:
Telangana Municipal Polls 2020 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. నామినేషన్ వేసిన అభ్యర్థులు డోర్‌ టు డోర్ క్యాంపెయిన్‌ చేస్తూ తనను గెలిస్తే అది పూర్తి చేస్తాను... ఇది ఇప్పిస్తానంటూ వాగ్ధానాలు, హామీలు ఇస్తూ... ప్రత్యర్థి పార్టీలను ఉతికారేస్తూ... ముందుకు సాగుతున్నారు. కార్యకర్తలు పార్టీ జెండాలతో వారి వెంట వెళ్తున్నారు. ఎంతో కోలాహలంగా సాగిపోతున్నాయి ఈ ప్రచారాలు. ఇదంతా ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కనిపిస్తున్న సీన్. రాత్రి కాగానే పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి... హామీ ఇచ్చిన వారు జారిపోకుండా ఉండడానికీ నానా పాట్లు పడాల్సి వస్తుంది నేతలు. ఓ వైపు బిర్యానీ డోర్ టు డోర్ అందజేయడం... కుదిరితే అందరినీ ఓ దగ్గరకు పిలిచి విందు భోజనం ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. ఇక మందు బాబులకైతే మద్యాన్ని అందిస్తున్నారు. ఐతే... ఈ మందు దగ్గరే మేటర్ తేడా వస్తోంది. అభ్యర్థులకు కొత్త చిక్కు వచ్చిపడుతోంది. ఏదో ఓటర్లను ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నం కాబట్టి తక్కువలో దొరికే బ్రాండ్ మద్యాన్ని అందజేస్తున్నారట. ఓటర్లు మాత్రం ఇదే అదునుగా చూసుకుని... తమకు ఖరీదైన బ్రాండ్ మద్యం కావాలని చెప్పేస్తున్నారట. తాము వ్యాట్ 69, బ్లాక్ డాగ్, టీచర్స్ లాంటి బ్రాండ్స్ లిక్కర్‌నే తాగుతున్నామనీ... అవి ఇస్తేనే మీ పని జరుగుతుందని మొహం మీదే చెబుతున్నారట. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక... అప్పు చేసైనా సరే... ఓటర్లు అడిగిన బ్రాండెడ్ మద్యాన్ని అందజేస్తున్నారట అభ్యర్థులు. అందువల్ల మున్సిపోల్స్‌కి కూడా ఖర్చు తడిసి మోపెడవుతోందని సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఘొల్లు మంటున్నారట నేతలు.

First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>