తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీపీఎస్ సర్వే ఏం చెప్పింది?

Telangana Municipal Election 2020 Results | అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరే కొనసాగిందని వెల్లడించింది. టీఆర్ఎస్ దూకుడుకు విపక్షాలు కళ్లెం వేయలేకపోయాయని అభిప్రాయపడింది.

news18-telugu
Updated: January 25, 2020, 8:59 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీపీఎస్ సర్వే ఏం చెప్పింది?
మున్సిపల్ ఎన్నికల పోలింగ్
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో విజేతలు ఉత్కంఠకు తెరపడనుంది. కరీంనగర్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపును ఈ నెల 27న చేపట్టనున్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదా? లేదంటే కారు జోరుకు కాంగ్రెస్ బ్రేకులు వస్తుందా? కమల దళం ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా? అన్ని అంతటా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇక గెలుపుపై అన్ని పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీపీఎస్ సర్వే చేసింది. వార్ వన్ సైడేనని తేల్చేసింది.   అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరే కొనసాగిందని వెల్లడించింది. టీఆర్ఎస్ దూకుడుకు విపక్షాలు కళ్లెం వేయలేకపోయాయని అభిప్రాయపడింది.

120 మున్సిపాలిటీల్లో 104-109 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశముందని సీపీఎస్ సర్వే అభిప్రాయపడింది. కాంగ్రెస్‌కు 0-4, బీజేపీకి 0-2, ఎంఐఎంకు 1-2 స్థానాలు రావొచ్చని తెలిపింది. 7-10 మున్సిపాలిటీల్లో హోరాహోరీ ఫలితాలు ఉండవచ్చని పేర్కొంది.

ఇక కార్పొరేషన్ల విషయానికొస్తే.. జనవరి 22న 9 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగ్గా, మొత్తం తొమ్మిదింటినీ టీఆర్ఎస్సే కైవసం చేసుకోవచ్చని సీపీఎస్ సర్వే తెలిపింది. 0-1 కార్పొరేషన్లలో బీజేపీకి అవకాశాలున్నాయని అభిప్రాయపడింది.

మొత్తం కార్పొరేషన్లు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం
9 9 0 0-1 0

కాగా, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ ఫలితాలు జనవరి 27న ప్రకటిస్తారు.

సీపీఎస్ సర్వే ఫలితాలు


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడేనన్న సీపీఎస్ సర్వే అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు