మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై హరీశ్ రావు రియాక్షన్

Telangana Municipal Elections 2020 Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ముందుగా అందరూ ఊహించినట్లే వార్ వన్ సైడ్ గా సాగింది. టీఆర్ఎస్ 100కు పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా...కాంగ్రెస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

news18-telugu
Updated: January 25, 2020, 1:41 PM IST
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై హరీశ్ రావు రియాక్షన్
మంత్రి హరీశ్ రావు(File Photo)
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే వార్ వన్ సైడ్‌గా సాగింది.  టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.  కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవాలన్న బీజేపీ ఆశలు నెరవేరలేదు.   ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్నికలు జరిగిన  మొత్తం  120 మున్సిపాలిటీల్లో దాదాపు 107 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్లా కారు జోరు కొనసాగింది. 9 కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్‌దేనని మరోసారి తెలంగాణ ప్రజలు రుజువు చేశారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ప్రభంజనమే వీసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అభినందనలు తెలియజేస్తున్నట్లు హరీశ్ రావు ట్వీట్ చేశారు. అలాగే పార్టీ విజయానికి కృషి చేసిన మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, టీఆర్ఎస్‌కు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.





First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు