కొనసాగుతున్న కౌంటింగ్...పరిషత్ ఫలితాలపై ఉత్కంఠ

రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. సుమారు 35వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొన్నారు.

news18-telugu
Updated: June 4, 2019, 8:48 AM IST
కొనసాగుతున్న కౌంటింగ్...పరిషత్ ఫలితాలపై ఉత్కంఠ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల లెక్కింపును పూర్తయ్యేలా ఈసీ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. సుమారు 35వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్‌ బాక్సుల్లో ఉన్న ఓట్లను బయటకు ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా వేరు చేస్తారు. మొదట ఎంపీటీసీ ఓట్ల లెక్కింపును పూర్తిచేసి..అనంతరం జడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు.

మరో నాలుగు రోజుల్లో ఎంపీటీసీలు ఎంపీపీని, జెడ్పీటీసీలు జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌‌ను ఎన్నుకుంటారు. ప్రమాణస్వీకారం చేయకుండానే ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్‌లను ఎన్నుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పంచాయతీ రాజ్ చట్టం-2018లోని 147, 176 సెక్షన్లను సవరించింది. అక్రమాలు, ఫిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్ట సవరణ చేశారు. ఇక జులై 3న ఎంపీటీసీ, జులై 4న జెడ్పీటీసీలు ప్రమాణస్వీకారం చేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టులో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు.

తెలంగాణలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,426 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18,930 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 6న మొదటి దశ ఎన్నికలు, మే 10న రెండో దశ ఎన్నికలు, మే 14న మూడో విడత ఎన్నికలను నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్థానిక సంస్థల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఫలితాలే రిపీట్ అవుతాయని టీఆర్ఎస్‌కు షాక్ తప్పదని బీజేపీ, కాంగ్రెస్ ధీమా వ్యక్తంచేస్తున్నాయి.



First published: June 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు