ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ఆ రోజునే...కౌంటింగ్‌కు ఏర్పాట్లు షురూ

telangana mptc zptc election result: 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. సుమారు 34వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. ఉదయం 8గంటల నుంచి ఓట్లను లెక్కించి..అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

news18-telugu
Updated: May 28, 2019, 6:58 PM IST
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ఆ రోజునే...కౌంటింగ్‌కు ఏర్పాట్లు షురూ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 28, 2019, 6:58 PM IST
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 4న ఓట్లు లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వాస్తవానికి జూన్‌ 4 కంటే ముందే ఓట్ల లెక్కింపు చేపట్టాలని భావించినా..నల్గొండ, వరంగల్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. వాటి లెక్కింపు జూన్ 3న ఉన్న నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌ను జూన్ 4న చేపట్టనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. సుమారు 34వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. ఉదయం 8గంటల నుంచి ఓట్లను లెక్కించి..అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. జులై 3న ఎంపీటీసీ, జులై 4న జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టులో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు.

మరోవైపు ప్రమాణస్వీకారం చేయకుండానే ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్‌లను ఎన్నుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పంచాయతీ రాజ్ చట్టం-2018లోని 147, 176 సెక్షన్లను సవరించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీచేసింది. అక్రమాలు, ఫిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్ట సవరణ చేసినట్లు ప్రకటించింది.


తెలంగాణలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. మే 6న మొదటి దశ ఎన్నికలు, మే 10న రెండో దశ ఎన్నికలు, మే 14న మూడో విడత ఎన్నికలను నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్థానిక సంస్థల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఫలితాలే రిపీట్ అవుతాయని టీఆర్ఎస్‌కు షాక్ తప్పదని బీజేపీ, కాంగ్రెస్ ధీమా వ్యక్తంచేస్తున్నాయి.


First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...