ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు లైన్ క్లియర్...త్వరలో ఫలితాలు

పంచాయతీ రాజ్ చట్టం-2018లోని 147, 176 సెక్షన్లను సవరించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీచేసింది. అక్రమాలు, ఫిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్ట సవరణ చేసినట్లు ప్రకటించింది.

news18-telugu
Updated: May 27, 2019, 7:37 PM IST
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు లైన్ క్లియర్...త్వరలో ఫలితాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది. ప్రమాణస్వీకారం చేయకుండానే ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్‌లను ఎన్నుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పంచాయతీ రాజ్ చట్టం-2018లోని 147, 176 సెక్షన్లను సవరించింది. ఈ మేరకు తెలంగాణ న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీచేసింది. అక్రమాలు, ఫిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్ట సవరణ చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీలను ప్రకటించనుంది ఎన్నికల సంఘం.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు లైన్ క్లియర్ కావడంతో త్వరలోనే ఫలితాలు వెలువడనున్నాయి.స్వల్ప విరామంతో ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్‌ల ఎన్నిక కూడా జరగనుంది. జులై 3న ఎంపీటీసీ, జులై 4న జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఆగస్టులో ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు.


వాస్తవానికి మే 27నే కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఐతే ఫలితాలు వెల్లడించిన తరువాత ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు 40రోజులకు పైగా సమయం పడుతుంది. ఆ సమయంలో ఒక పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులను మరో పార్టీ కొనుగోలు చేసే ప్రమాదం ఉందంటూ పలు పార్టీలు ఎన్నిలక సంఘానికి ఫిర్యాదు చేశాయి. విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌ను వాయిదావేసింది. ఇప్పుడు ఫిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్టసవరణ చేయడంతో కౌంటింగ్‌పై దృష్టిపెట్టింది ఎన్నికల సంఘం.

తెలంగాణలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. మే 6న మొదటి దశ ఎన్నికలు, మే 10న రెండో దశ ఎన్నికలు, మే 14న మూడో విడత ఎన్నికలను నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్థానిక సంస్థల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఫలితాలే రిపీట్ అవుతాయని టీఆర్ఎస్‌కు షాక్ తప్పదని బీజేపీ, కాంగ్రెస్ ధీమా వ్యక్తంచేస్తున్నాయి.
First published: May 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు