మీకున్న మంచిపేరు పోతుంది... సీఎం జగన్‌కు తెలంగాణ ఎంపీ సలహా

ఓవైపు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ... మరోవైపు తెలంగాణకు చెందిన ఓ ఎంపీ ఏపీలో సీఎం జగన్‌ పాలనపై ప్రశంసలు కురిపించారు.

news18-telugu
Updated: October 16, 2019, 8:09 AM IST
మీకున్న మంచిపేరు పోతుంది... సీఎం జగన్‌కు తెలంగాణ ఎంపీ సలహా
వైఎస్ జగన్
news18-telugu
Updated: October 16, 2019, 8:09 AM IST
తెలుగు రాష్ట్రాల రాజికీయాలు వాడివేడిగా మారాయి. ముఖ్యంగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మెతో పాలిటిక్స్ వేడెక్కుతన్నాయి. ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని విపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను తిడుతూనే... తెలంగాణకు చెందిన ఓ ఎంపీ సీఎం జగన్‌ పాలనకు మద్దతిచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పట్టించుకోని కేసీఆర్‌తో జగన్ కలిస్తే... ఆయనకున్న మంచి పేరు కూడా పోతుందన్నారు తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్‌తో కలవొద్దని సలహా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు పలు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ‘కేసీఆర్ కార్మిక వ్యతిరేకి. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చావడానికి ఆయనే కారణం. మీరు కేసీఆర్ తో కలవవద్దు. మీరు కలిస్తే మీ పేరు, మీ నాన్న పేరు కూడా చెడిపోతాయి’ అని జగన్ కు కోమటిరెడ్డి సూచించారు. ఏపీలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికి ఆర్టీసీని ప్రభుత్వంలో జగన్ విలీనం చేశారని కొనియాడారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేకపోతున్నారని కేసీఆర్‌ను విమర్శించారు కోమటి రెడ్డి . మరి కోమటిరెడ్డి సలహాను జగన్ ఎంతవరకు పాటిస్తారన్నది వేచి చూడాల్సిందే.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...