Telangana mlc elections: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కోదండరామ్.. టీజేఎస్ ప్రకటన

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు తెలంగాణ జనసమితి కూడా బరిలోకి దిగుతోంది. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ పోటీచేయబోతున్నారు.

news18-telugu
Updated: October 5, 2020, 2:27 PM IST
Telangana mlc elections: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కోదండరామ్.. టీజేఎస్ ప్రకటన
ప్రొఫెసర్ కోదండరాం (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 3న దుబ్బాకలో పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం పట్టుభద్రల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఐతే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు తెలంగాణ జనసమితి కూడా బరిలోకి దిగుతోంది. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంలో ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ పోటీచేయబోతున్నారు. ఈ మేరకు సోమవారం టీజేఎస్ ప్రకటన విడుదల చేసింది. ప్రశ్నించే గొంతుకు ఉండేందుకే కోదండరామ్ పోటీ చేస్తున్నారని తెలిపింది.

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్‌గానే దృష్టి సారించారు. నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానంనుంచి పోటీచేసేందుకు ముందు నుంచీ ఆసక్తి కనబరిచారు. ఓటర్ల నమోదుకు సంబంధించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మద్దతుతో నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానానికి పోటీ చేయాలని ఆయన మొదట భావించారు. ఐతే కోదండరామ్‌కు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్ నేతలు ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ వద్ద కూడా స్పష్టం చేశారు. వేరొక పార్టీకి చెందిన నేతకు మద్దతు ఇవ్వొద్దని.. పార్టీ కోసం కష్టపడుతున్న తమ పార్టీ నేతనే బరిలోకి దింపుదామని సూచించారు. ఈ నేపథ్యంలో కోదండరామ్ ఒంటరిగానే పోటీచేస్తున్నారు.

కాగా, ఖమ్మం-వరంగల్‌-నల్గొండ, హైదరాబాద్‌-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసింది. పట్టభద్రుల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది నవంబర్‌ నాటికి డిగ్రీ ఉత్తీర్ణులు అయ్యి మూడేళ్లు పూర్తి చేసి ఉండాలి. వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.

అక్టోబర్‌ 1 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభహైంది. 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేసిన నేపథ్యంలో.. 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఓటరు నమోదుకు నవంబర్‌ 11 వరకు వరకు గడువు ఉంది. డిసెంబర్‌ 1న ఓటరు ముసాయిదాను ప్రకటిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 18 ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఓటరు నమోదుపై ఆయా జిల్లాల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: October 5, 2020, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading