Home /News /politics /

TELANGANA MLC ELECTIONS MINISTER SRINIVAS GOUD CURSES PEOPLE SU

Minister Srinivas Goud: భగవంతుడు కూడా క్షమించడు.. వాళ్లు బాగుపడరు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాపనార్థాలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్(Image-Twitter)

మంత్రి శ్రీనివాస్ గౌడ్(Image-Twitter)

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. పోటీలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక, అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు తరఫున మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి తరఫున మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది, తమ పార్టీ అభ్యర్థికి ఓటెయ్యని వారిని భగవంతుడు కూడా క్షమించడని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వాళ్లు బాగుపడరని.. వాళ్ల ఇండ్లు నాశనమై పోతాయని శాపనార్థాలు పెట్టారు.

    ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్​నగర్ జిల్లా బాదేపల్లిలోని చంద్రాగార్డెన్​లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్​గౌడ్ మాట్లాడుతూ.. "ఎవడైనా దుర్మార్గుడు కల్యాణలక్ష్మి తిని, రకరకాల కరెంట్ బిల్లులు, రైతు బీమా, వాళ్ల తల్లులకు పెన్షన్.. అన్నీ తిని.. ఇలాంటి పార్టీకి ద్రోహం చేస్తే భగవంతుడు కూడా క్షమించడు.. వాడు బాగుపడడు.. వాని ఇల్లు బాగుపడదు.. " అని వ్యాఖ్యానించారు. అలాగే కర్ణాటకలో బీజేపీ పాలనపై ఆయన పరోక్షంగా మండిపడ్డారు. అలాంటి వారు ఇక్కడికి వస్తే ఎట్ల సపోర్ట్ చేస్తామని విమర్శించారు.

    టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Srinivas goud, Telangana mlc election, Trs

    తదుపరి వార్తలు