Home /News /politics /

TELANGANA MINSTER KTR FIRED ON NARENDRA MODI GOVERNMENT OVER UNION BUDGET 2022 ALLOCATION AND HE ALLEGED THAT THE CENTER HAS IGNORED TELANGANA APPEALS PRV

Union budget 2022: కేంద్ర బడ్జెట్​పై మంత్రి కేటీఆర్​ విమర్శలు.. తెలంగాణ దేశంలో భాగమే కాదన్నట్లు నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తోందంటూ ఫైర్​

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ (Union Budget 2022)పై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ (Union Budget 2022)లో పేదలకు పనికొచ్చేది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నారు మంత్రి. 

అభివృద్ది, సంక్షేమంలో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలబడమని కోరితే కేంద్రం పట్టించుకోలేదని మంత్రి కేటీఆర్ (Minister KTR) ​ ఆరోపించారు.  కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ (Union Budget 2022)పై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ (Union Budget 2022)లో పేదలకు పనికొచ్చేది ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నారు మంత్రి.  దేశంలో భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం, జనాభాపరంగా 12వ పెద్ద రాష్ట్రమైన తెలంగాణ.. దేశానికి తిండి పెట్టే రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉందన్నారు కేటీఆర్​. ఈ మాట తాము చెబుతున్నది కాదని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోందని ఆయన పేర్కొన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా మరోసారి మొండి చెయ్యి చూపిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాన్ని విస్మరించిందన్నారు.

కేంద్రం సవతి తల్లి ప్రేమ..

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నింటినీ బుట్ట దాఖలు చేసి.. తెలంగాణ (Telangana) అసలు దేశంలో భాగమే కాదన్నట్లుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వ్యవహరించిందని మంత్రి కేటీఆర్  ఆరోపించారు. తెలంగాణ (Telangana)పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని విమర్శించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ (KTR) ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో రూ.7వేల కోట్ల పైచిలుకు నిధులతో ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లలో మంచి క్లాస్ రూమ్స్, డైనింగ్ హాల్స్, స్టాఫ్ రూమ్స్, క్రీడా ప్రాంగణాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ది పనుల్లో పేదలు ఉండే ప్రాంతాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం టాప్ ప్రియారిటీ ఇస్తుందన్నారు. కేంద్రం ఇవ్వనంత మాత్రాన రాష్ట్రంలో ఆగేదేమీ లేదని.. ప్రజలందరి ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) ఇలాగే ముందుకు దూసుకుపోతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు కేసీఆర్​ సైతం కేంద్ర బడ్జెటపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో పాటు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మాల సీతారామన్‌పై ఆయన నిప్పులు చెరిగారు. కనీస ఆలోచన లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆయన దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని ఏ ఒక్క వర్గానికి కూడా అనుకూలంగా లేదని విమర్శించారు. కరోనా లాంటీ మహమ్మారీ పీడించిన తర్వాత కూడా హెల్త్‌లో బడ్జెట్ పెంచాల్సిన ప్రభుత్వం, కోతలు విధించిందని మండిపడ్డారు. బీజేపీ పాలన అంటే, దేశ ఆస్తులను అమ్మడం, మతపిచ్చి లేపడం , మంది మీద పడి ఏడ్వడమే అని అన్నారు. పీఎం మోదీ సిగ్గు లేకుండా సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. ఎవరి సంక్షేమం కోసం బడ్జెట్ పెంచని ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందని ప్రశ్నించారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Budget 2022-23, Minister ktr

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు